1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Songs

Neelo.. Nalo| Songs| Kick| Shyam| Sneha | జూలై 3న "నీలో.. నాలో" పాటలు

నీలో నాలో
WD
"కిక్" శ్యామ్ హీరోగా, అందాల తార స్నేహ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం నీలో.. నాలో". "బిట్వీన్ యు అండ్ మి" అనేది దీనికి ఉపశీర్షిక.

నైన్త్ ఛానెల్ పతాకంపై నందు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని విజయ శ్రీ నందకుమార్ నిర్మిస్తున్నారు. స్టార్ కమెడియన్ సునీల్, "ఆనందం" ఫేమ్ రేఖ, అరుణ్‌పాండ్యన్, జూనియర్ రేలంగి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. పి.బి.బాలాజీ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రానికి అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రం ఆడియో జూలై 3న విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు నందు మాట్లాడుతూ.. "కిక్" శ్యామ్ నటన, స్నేహ గ్లామర్, బాలాజీ సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయన్నారు. జూలై 3న పాటలను విడుదల చేసి, నెలాఖరుకు చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు చెప్పారు.

ప్రేమలోని సరికొత్త కోణాన్ని స్పృశిస్తూ రూపొందిన "నీలో.. నాలో" చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నందు ఆశాభావం వ్యక్తం చేశారు.
About Writer
SELVI.M