1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nayantara

Ajith| Nayantara| Mallika I Love You| Navadeep| Raju Sundaram | అజిత్, నయన హీరోహీరోయిన్లుగా ''మల్లిక ఐ లవ్‌యూ''

అజిత్
అజిత్‌, నయనతార, నవదీప్‌ కాంబినేషన్‌లో, నృత్యదర్శకుడు రాజుసుందరం దర్శకత్వంలో తమిళంలో విజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో 'మల్లిక ఐ లవ్‌ యూ'గా అనువదిస్తున్నారు. స్నేహల్‌ ఇంటర్నేషనల్‌ మూవీస్‌ పతాకంపై వాగిచర్ల మురళీకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత.

ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ, రాజుసుందరం దర్శకత్వం వహించిన తొలి చిత్రమిదన్నారు. ఇందులో అజిత్‌ పోలీస్‌ఆఫీసర్‌గా నటిస్తున్నారని, నవదీప్‌ కాలేజీ స్టూడెండ్‌ పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. నయనతార అందాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు.

అక్రమ మార్గంలో తండ్రి సంపాదించిన డబ్బుని పిల్లలు తిరస్కరిస్తే ఏమవుతుందనే కథాంశంతో సందేశాత్మకంగా ఈ చిత్రం రూపొందిందని నిర్మాత వెల్లడించారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం ఆకట్టుకునేవిధంగా ఉంటుందని ఆయన చెప్పారు.

ఇందులో ఆరు పాటలున్నాయి. 20కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిందని నిర్మాత వివరాలందించారు. ఈ చిత్రంలో సుమన్‌ విలన్‌గా నటించారనీ, ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయని సహనిర్మాత ప్రసాద్‌ తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో సుహాసిని, జయరాం, ప్రీతి వాజ్‌పేయి తదితరులు నటించారు. మాటలు: రాజశేఖర్‌రెడ్డి.
About Writer
SELVI.M