1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Rajshri Media

Telugu.com| Rajshri Media| Internet| Ramanaidu| Suresh Babu | తెలుగు వెబ్‌సైట్‌లోకి "రాజశ్రీ మీడియా"

తెలుగుకామ్
WD
హిందీలో పలు సీరియల్స్‌, సినిమాలు నిర్మించిన రాజశ్రీ మీడియా సంస్థ తెలుగు.కామ్‌ పేరుతో ఇంటర్నెట్‌ రంగంలోకి ప్రవేశించింది.

మూవీమొగల్‌ డా. డి. రామానాయుడు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ. బర్‌జాత్యా తెలియజేశారు.

తాము నెలకొల్పిన ఈ వెబ్‌సైట్‌ ద్వారా 1000 సినిమాలను ఉచితంగా చూడవచ్చని, అదేవిధంగా వివిధ సినిమాల పాటలను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని బర్‌జాత్యా తెలిపారు.

అంతేగాకుండా.. ఎంటర్‌టైన్‌‌‌మెంట్ రంగంలో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించామని బర్‌జాత్యా వెల్లడించారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పలు సూచనలు, సలహాలను అందజేస్తున్న డి. సురేష్‌ బాబుకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.