గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » విజయవాడలో "కరెంట్‌" ప్లాటినం డిస్క్‌వేడుక (Vijayawada| Current| Platinum Disk Function| Sushanth| Sneha Ullal)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
యంగ్ హీరో సుశాంత్, స్నేహా ఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన "కరెంట్" చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకకు చేరువైంది.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 28న సుశాంత్‌ 'కరెంట్‌' చిత్రం ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌వేడుకను వైభవంగా నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాత శ్రీనివాసరావు, నాగసుశీల తెలిపారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరెంట్ నిర్మాతలు మాట్లాడుతూ, కరెంట్‌ సినిమా మొదటివారంలోనే సుశాంత్‌ నటించిన 'కాళిదాసుకంటే' ఎక్కువ వసూలు చేసిందన్నారు.

నిజాం ఏరియాలో గ్రాస్‌-10487223 కాగా, షేర్‌- 4870513, సీడెడ్‌- 3800000కాగా షేర్‌- 2195581, విశాఖ- 2103318 కాగా 1314244, ఈస్ట్‌ గోదావరి- 1397078, 903059, వెస్ట్‌గోదావరి- 1100000 కాగా 650000, కృష్ణ (విజయవాడ)- 1924303, 1292000, గుంటూరు- 1749663, 1011989, నెల్లూరు- 1450000, 750000, బళ్ళారి 492000 కాగా షేర్‌ 350000, ఒరిస్సా- 500000 కాగా షేర్‌ 325000 వసూలుచేసిందని చెప్పారు.

దర్శకుడు సూర్యప్రతాప్‌ కొత్తవాడయినా అద్భుతంగా తెరకెక్కించారనీ, దేవీశ్రీప్రసాద్‌ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచిందని నిర్మాతలు వెల్లడించారు. ప్లాటినం డిస్క్ వేడుక రోజే దేవీశ్రీప్రసాద్‌ మ్యూజికల్‌ నైట్‌కూడా ఉంటుందనీ, సుశాంత్‌, స్నేహా ఉల్లాల్‌కూడా స్టేజీపై పెర్‌ఫార్మ్‌ చేస్తారని వారు తెలిపారు. అక్కినేని అభిమానులకు నాగసుశీల ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: విజయవాడ, కరెంట్, ప్లాటినం డిస్క్ వేడుక, సుశాంత్, స్నేహా ఉల్లాల్