''ఏడాదిన్నర అయ్యింది మీ అప్యాయతలు, మీ కేరింతలు చూసి. ఇంతమందిని, ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళాల్సి వస్తుందనుకోలేదు.
ఇండస్ట్రీకి వస్తే సొంతింటికి వచ్చినట్లుంది" అని పీఆర్పీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
ఇక్కడ అందరూ ఒకరి బాగోగులు ఒకరు కోరుకుంటారు. అక్కడ ఎవడిగోలవాడిదే..." ఏదైనా చాలా మిస్ అయ్యాను. అంతా దైవనిర్ణంయ ఎలా జరగాలని ఉందో? అలానే జరుగుతుంది. నేను మళ్ళీ నటించాలని పరుచూరి వెంకటేశ్వరరావు అడిగారు. సినిమా చేయమన్నారు. కానీ కమిట్ అవ్వను. పరిస్థితులు వస్తే.. ఏమిటి అనేది చెబుతానని'' చిరు మగధీర ఆడియో వేడుకలో తెలిపారు.
రామ్‌చరణ్ తేజ కథానాయకుడిగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన 'మగధీర' ఆడియో విడుదల కార్యక్రమం అభిమానుల కేరింతల మధ్య ఆదివారం రాత్రి శిల్పకళావేదికలో జరిగింది. ఈ సందర్భంలో చిరంజీవి పైవిధంగా స్పందించారు. తాను రాజకీయాల్లో ఉన్నా మనసంతా ఇండస్ట్రీలోనే ఉందని అభిమానులనుద్దేశించి అన్నారు. చిత్రం యూనిట్ గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు.
అభిమానంతో ఎత్తుతారు.. కానీ ఎత్తుగడలుండవు ఇండస్ట్రీలో ప్రతిఒక్కరూ బాగోగులు కోరుకుంటారు. అభిమానంతో ఎత్తుకుంటారు. కానీ రాజకీయాల్లోల్లా ఎత్తుగడలుండవని చిరు అన్నారు. ఒకప్పుడు 'మగధీరుడు' సినిమాను తాను చేశాను. యాదృశ్చికంగా 'మగధీర' అనే టైటిల్ రామ్‌చరణ్‌కు పెట్టారు. మొదటి చిత్రం 'చిరుత' పేరుగా పెట్టారు. పూరీజగన్నాథ్ దర్శకుడు. చిరు తనయుడు కాబట్టి చిరుత అని పెట్టామన్నారని చిరంజీవి వివరించారు.
అదేవిధంగా 2వ సినిమాలోనూ అలాగే కుదిరింది. ఇక కీరవాణి అద్భుతమైన టెక్నీషియన్. పాటలు విన్నాను. ఒక్కోపాట ఆణిముత్యం. 3 సెకన్లపాటు ఓ పాటలో కనబడతాను ఇందులో ఓ పాట తనకు సంబంధించిందని చిరంజీవి చెప్పారు.
గతంలో తాను డ్యాన్స్ చేసిన "బంగారు కోడిపిట్ట" పాటకోసం 4 రాత్రులు ప్రాక్టీస్ చేశాను. ప్రభుదేవా డాన్స్‌మాస్టర్. వైజాగ్ షిప్‌యార్డ్‌లో పాట చేస్తున్నాం. ఆ సమయంలో ప్రభు ఒన్స్‌మోర్ అన్నారు. కానీ అక్కడ షిప్‌యార్డ్ కూలీలు, అభిమానులు మెగాస్టార్ చేసిందే ఒకే.. వన్స్‌మోర్ వద్దని అడ్డుపడ్డారు. ఇక లాభంలేదని అక్కడే హౌటల్‌లోనే ప్రాక్టీస్‌చేసి షూటింగ్ చేశామని చెప్పుకొచ్చారు.
ఈ పాటలో ప్రత్యేకత ఉంది. ఇందులో మూడు సెకన్లపాటు తాను కనబడే విధంగా రాజమౌళి ప్లాన్ చేశారు. కథ పరంగా చెప్పాలంటే.. ఈ మధ్య పునర్జన్మ చిత్రాలు రాలేదు. మగధీరలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ దృశ్యకావ్యంగా ఉంటుంది. సినిమా చూశాను. సూపర్‌డూపర్‌గా ఆడుతుంది.
తండ్రిగా జలసీగా ఉంది ఒకరకంగా రామ్‌చరణ్‌ను చూస్తుంటే తండ్రిగా జలసీగా ఫీలవుతున్నాను. హార్స్‌రైడింగ్ నేను డూప్‌లేకుండా చేశాను. 'కొదమసింహం', 'వేట' చిత్రాల్లో తనకు ట్రైనింగ్ ఎవరూ లేరు. ఫైటర్లు ఎలా చెబితే అలా చేయాల్సిందే. రామ్‌చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పే రీతిలో ఎదిగిన చిరుతకు, ఎంత డబ్బు ఖర్చయినా రామ్‌చరణ్ అభిరుచి మేరకే అన్నీ నేర్పానని చిరంజీవి చెప్పారు. మద్రాస్ రేస్‌కోర్సులో హార్స్‌రైడింగ్ నేర్పించానని చిరు తెలియజేశారు.
గజనీ డబ్బులు ఇందులో పెట్టాడు కథప్రకారం శ్రీహరి ఇందులో చేయాలన్నారు. హీరోగా చేస్తున్న శ్రీహరి ఈ చిత్రంలో చేస్తాడా? లేదా అనుకున్నాను. కానీ రాజమౌళి చెప్పగానే... చిరంజీవి తన మిత్రుడు. ఆయనతో కలిసి సినిమా చేస్తున్నప్పుడు రామ్‌చరణ్ చిన్నపిల్లవాడు. వాడికి జిమ్నాస్టిక్స్ తానే నేర్పానని గుర్తుచేసుకుని శ్రీహరి ఆనందంగా ముందుకు వచ్చాడు. ఇక సినిమాపరంగా అల్లు అరవింద్ అత్యధికంగా ఖర్చుపెట్టారు. ఉన్నతస్థాయి ప్రమాణాలతో తీశారు. ఆయన హిందీ గజనీలో వచ్చిన డబ్బుల్లోంచి కొంత మగధీరకు వెచ్చించారు... అని చిరంజీవి అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ ద్వారా మగధీర ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. ఈ కార్యక్రమంలో పవన్‌కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, శ్రీహరి, శ్రీకాంత్, అలీ, అశ్వనీదత్, రామానాయుడు, కె. రాఘవేంద్రరావు ఇతర సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు.