1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Iliyana

Nithin| Iliyana| Rechi Po| For Love| Logo| Raghu Babu | నితిన్, ఇలియానాల "రెచ్చిపో" లోగో ఆవిష్కరణ

నితిన్
నితిన్‌, ఇలియానా నటిస్తున్న చిత్రానికి 'రెచ్చిపో' (ఫర్‌ లవ్‌) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్ర లోగోను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నితిన్‌ ఆవిష్కరించారు.

ఈ చిత్రాన్ని శ్రీ స్పెక్ట్రా మీడియా పతాకంపై జి.వి. రమణ నిర్మించగా, పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా గురించి నితిన్‌ మాట్లాడుతూ, షూటింగ్‌ దాదాపు పూర్తికావచ్చిందన్నారు. ఇంకా రెండుపాటలు, రెండురోజుల ప్యాచ్‌వర్క్‌ మిగిలి ఉందని చెప్పారు. ఈ చిత్రంలో రఘుబాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ అద్భుతంగా వచ్చింది. అవార్డు వస్తుందనుకుంటున్నానని వివరించారు.

రఘుబాబు మాట్లాడుతూ, దుబాయ్‌లో 50డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండలో హీరోహీరోయిన్ల లగేజీని మోస్తూ సాగే సన్నివేశాలు చాలా కష్టపడి తీశారు. కష్టానికి తగిన ఫలితం వస్తుందనుకుంటున్నానన్నారు.

నిర్మాత మాట్లాడుతూ, కథప్రకారం మొదటిభాగం ఇండియాలో, రెండవభాగం దుబాయ్‌లో తీయాల్సి వచ్చింది. ఈ చిత్రానికి పలువురు విదేశీ టెక్నీషియన్స్‌ పనిచేశారు. ఇందులో సరికొత్త రోల్‌లో నితిన్‌ను చూస్తారని చెప్పారు.

ఇంకా ఈ చిత్రానికి మాటలు: రమేష్‌-గోపి, సంగీతం: మణివర్మ, యాక్షన్‌: సెల్వ. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరుచూరి మురళి.
About Writer
SELVI.M