బాలాదిత్య, గీతాసింగ్, రవళి, ప్రవళిక ప్రధాన తారాగణంగా రూపొందిన 'పిల్లదొరికితే పెళ్లి' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథి దర్శకుడు సాగర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే చిత్రంలా టైటిల్ చక్కగా అమరిందన్నారు. శరత్ ఫొటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తుందని, బాలాదిత్య పెర్‌ఫార్మెన్స్‌పరంగా అద్భుతంగా చేశాడని కితాబిచ్చారు. బొంబై బోలో పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. భవిష్యత్‌లో కృష్ణ మంచి దర్శకుడు అవుతాడని సాగర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో హాజరైన రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. ఆరు పాటలను వైవిధ్యమైన బాణీలతో రూపొందించారనీ, మాస్‌ను బాగా ఆకట్టుకునేలా ఈ చిత్రం పాటలున్నాయని తెలిపారు.
బాలాదిత్య మాట్లాడుతూ, ఇది చక్కని ఎంటర్‌టైనర్. గతంలో గీతాసింగ్‌తో కలిసి చంటిగాడు సినిమా చేశానని అన్నారు. మళ్ళీ ఈ కాంబినేషన్‌లో చేశాను. ఇందులో ఓ రీమిక్స్ సాంగ్ కందికొండ అద్భుతంగా రాశారు. ఈ పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని బాలాదిత్య చెప్పారు.
చిత్ర దర్శకుడు కృష్ణ మాట్లాడుతూ, ఈ చిత్రం షూటింగ్‌తోపాటు పోస్ట్‌ప్రొడక్షన్స్ చివరి దశలో ఉందనీ, వచ్చేనెలలో విడుదల చేయనున్నామని తెలిపారు.