1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rakhi Sawant

Rakhi Sawant SwayamVar| Rakhi Sawant| NDTV| Imagine Channel| Jaipur | రాఖీని గెలుచుకునేందుకు 16మంది మగాళ్లు

రాఖీ సావంత్స్ స్వయంవర్
సినీ రంగంలో అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రాఖీ సావంత్ స్వయం వరానికి సిద్ధమైంది. ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న వినూత్న టీవీ రియాల్టీ షో "రాఖీ సావంత్స్ స్వయంవర్" సోమవారం రాత్రి 9 గంటలకు ఎన్డీటీవీ ఇమాజిన్ ఛానెల్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.

సోమవారం నుంచి శుక్రవారం వరకు సాగే ఈ రియాల్టీ షోలోని మొదటి ఎపిసోడ్‌లో, వరుడి వేటలో పడిన రాఖీని భార్యగా పొందడానికి పోటీ పడుతున్న 16 మంది యువకులు ఆమెను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. వీరిలో ఈలేశ్ మరో ఇద్దరికి రాఖీ సావంత్ తొలి ప్రేమకు కానుకలుగా రత్నాలతో పొదిగిన పతకాలను స్వహస్తాలతో అందించారు.

ఇంకా జైపూర్‌లోని ఫతేగడ్ కోటలో ప్రారంభమైన రాఖీ స్వయంవర్ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ రామ్ కపూర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ షో నిర్వహిస్తున్న రామ్ కపూర్ వరుడి ఎంపికలో రాఖీకి సాయపడుతూ మాట్లాడిన తీరు బాగుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ స్వయంవరంలో రాఖీసావంత్ అందచందాలకు తగిన వరుడు లభిస్తాడో? లేదో? వేచి చూడాల్సిందే..!
About Writer
SELVI.M