గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » దాసరిచే 'ఆ ఇంట్లో' ఆడియో విడుదల (Dasari| A intlo| Audio| Chinna| Dil raju| Koti| Arundathi)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
యు9 ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ పతాకంపై తన స్నేహితులతో కలిసి నటుడు చిన్నా దర్శకునిగా 'ఆ ఇంట్లో' అనే హార్రర్‌ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆడియో దర్శకరత్న డా. దాసరి నారాయణరావు చేతుల మీదుగా విడుదలైంది.

ఆడియో విడుదల సందర్భంగా దాసరి మాట్లాడుతూ, "నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి చిన్నాను తనకు పరిచయం చేశారు. ఎన్నో బిజినెస్‌లు ఉన్నప్పటికీ సినిమా అనేది తన ప్రాణమని ఆనాడే చెప్పేవాడు. ఈనాడు కూడా అదే చెబుతున్నాడు" అని దాసరి అన్నారు.

చిన్నా మంచి నటుడు. అయినప్పటికీ అతని ప్రతిభకు తగ్గ పాత్రలు దొరకలేదు. టాలెంట్‌లేని చాలామంది నటులు సినీ రంగంలో వెలుగుతున్నారు. టాలెంట్‌ ఉండి కూడా చాలా మందికి సరైన అవకాశాలు రాలేదు. ఇక్కడ కృషిని నమ్ముకున్న వారికి తప్పకుండా సక్సెస్‌ లభిస్తుందని అని దాసరి పేర్కొన్నారు. ఆ ఇంట్లో సినిమాకు సంగీతమే హీరో. ఇందులోని క్లిప్పింగ్‌లు.. చాలా బాగున్నాయని దర్శకరత్న చెప్పారు.

చిన్నా మాట్లాడుతూ.. సినిమా అంటే ప్రాణం. నటునిగా మంచి గుర్తింపు పొందాను. ఓ మంచి కథను తీసుకుని చాలామంది దర్శకత్వశాఖలో పనిచేస్తున్నవారికి చెప్పాను. వారికి చెప్పిన కథ అంతగా రీచ్ కాలేదు. దీంతో తన స్నేహితులు నువ్వే ఎందుకు చేయకూడదని అన్నారు. ఇలాగే దర్శకత్వ పగ్గాలు చేపట్టాల్సి వచ్చిందని వెల్లడించారు.

ఆ తర్వాత కొంతమంది టెక్నీషియన్స్‌ దగ్గరకు వెళ్ళి విషయాన్ని చెప్పాను. వారంతా రెమ్యునరేషన్‌ గురించి ఆలోచించవద్దు. సినిమా చెయ్యమని ప్రోత్సహించినట్లు చిన్నా తెలిపారు.

దాదాపు ఈ సినిమా కోసం ఏడునెలలు కష్టపడ్డాను. సరిగ్గా నిద్రపోయింది లేదు. కసితో సినిమా తీశాను. ఇందులో పెద్దగా మాటలు వుండవు. అందుకే మాటలు రాసుకున్నాను. ఇక పాటలపరంగా దాసరిగారి చిత్రంలో ఓ పాటను చూసి ప్రేరణ పొంది కొరియోగ్రఫీ కూడా చేసేశాను' అని చిన్నా చెప్పారు.

సి. కళ్యాణ్‌ మాట్లాడుతూ, చిన్నా తన వద్దకు వచ్చి ఓ సినిమా చేయాలనుందని చెప్పారు. ఇప్పటి పరిస్థితుల్లో వద్దన్నాను. తర్వాత కథ చెప్పాడు. సెకండాఫ్‌లో పదిహేను సీన్లు అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా చేయమన్నానని తెలిపారు.

దిల్‌రాజు మాట్లాడుతూ, తాను నిర్మాతగా మారి ఏడు సంవత్సరాలైంది. అప్పటినుంచి చిన్నా తనకు ఆర్టిస్టుగా బాగా తెలుసు. ఈ సినిమా డీటీఎస్‌ మిక్సింగ్‌లో చూశాను. చూసేముందు ఆర్టిస్టు తీశాడని పెద్దగా స్పందించలేదు. కానీ సెకండాఫ్‌ బ్రహ్మాండంగా ఉంది. ఆయనలో మంచి టెక్నీషియన్‌ దాగున్నాడు. ఆ ఇంట్లో చిత్రం మంచి విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

కోటి మాట్లాడుతూ, చిన్నా 30 ఏళ్ళ పరిచయం. ఈ సినిమాలో చిన్నా సంగీతం చేయడానికి స్వేచ్ఛ ఇచ్చారు. ఒక నెలపాటు రీరికార్డింగ్‌ చేశాం. ఈ చిత్రం అరుంధతి అంతటి హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పూరీజగన్నాథ్‌, ఆషాశైని, దేవన తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: దాసరి, ఆ ఇంట్లో, ఆడియో, చిన్నా, దిల్రాజు, కోటి, సి కళ్యాణ్, అరుంధతి, హారర్ మూవీ