గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » షూటింగ్‌లో పాల్గొన్న నందమూరి "యంగ్‌టైగర్" (NTR| Vinayak| Cinema| Shooting| Nayanatara| Sheela| Nani)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది.

కొడాలి నాని సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీ మోహన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం తాజా షెడ్యూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు.

బుధవారం ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నేటి నుంచి ఏకధాటిగా సినిమా పూర్తయ్యే వరకు షూటింగ్ జరుగుతుందన్నారు.

ఆది, సాంబ తర్వాత వినయ్ డైరక్షన్‌లో చేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఉంటుందని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక విలువలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వినయ్ అద్భుతంగా రూపొందిస్తున్నారని తెలిపారు.

సెన్సేషనల్ డైరక్టర్ వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. తారక్‌తో తాను చేస్తున్న మూడో సినిమా ఇదని చెప్పారు. తారక్ ఇమేజ్‌కి తగినట్లుగా ఉంటుందన్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకునే రీతిలో మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని వినాయక్ తెలిపారు. ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో మరో సెన్సేషనల్ చిత్రమిదవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుందని, ఎన్టీఆర్, వినయ్ కాంబినేషన్‌లో ఇది హ్యాట్రిక్ చిత్రమవుతుందని నిర్మాత, సమర్పకులు అన్నారు. అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఎన్టీఆర్, వినయ్ కాంబినేషన్‌లో ఐది ఓ లాండ్ మార్క్ ఫిలిమ్ అవుతుందని సమర్పకుడు అన్నారు.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా నాయికలుగా నటిస్తోన్న ఈ చిత్రానికి కథ, మాటలు: కోన వెంకట్, సంగీతం: దేవీశ్రీప్రసాద్, డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు, ఆర్ట్ డైరక్టర్: ఆనందసాయి, ఫైట్స్: స్టన్ శివ, పాటలు: చంద్రబోస్, ఎడిటింగ్: గౌతంరాజు, కో-డైరక్టర్: పుల్లారావు కొప్పినీడి, ఛీఫ్ కో-డైరక్టర్: తోట రామకృష్ణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: జి.జి.కె.రాజు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఎన్టీఆర్, వినాయక్, సినిమా, షూటింగ్, యంగ్టైగర్, నయనతార, షీలా, నాని