గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » "పుత్రుడి"ని ఆటపట్టిస్తోన్న చిన్నది! (Putrudu| Indra| Tatanisha| Bindu| Sravan Bapatla| Sonia tiwari)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
"చికెన్‌ముక్కలాంటి చిన్నదాన్నయో.. నీ మనసెరిగి వచ్చానయో.."అంటూ ఓ చిన్నది మెడికో స్టూడెంట్‌ను ఆటపట్టిస్తోంది. దీంతో ఆ చిన్నోడు కూడా ఆమెతో కలిసి చిందులేశాడు. ఈ దృశ్యాన్ని "పుత్రుడు" సినిమా కోసం తెరకెక్కిస్తున్నారు.

ఫ్రెండ్స్ అకాడమీ పతాకంపై ఇంద్ర హీరోగా, తదనీషా, బిందు హీరోయిన్లుగా నటిస్తోన్న "పుత్రుడు" సినిమా షూటింగ్ కోసం అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో ఓ సెట్‌వేసి రెండు రోజులుగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.

శుక్రవారంతో పాట పూర్తయిన సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రావణ్ బాపట్ల మాట్లాడుతూ.. ముంబైకి చెందిన సోనియా తివారీ, ఇంద్రపై ఐటమ్‌సాంగ్‌ను చిత్రీకరిస్తున్నామని చెప్పారు. సంగీతానికి ప్రాధాన్యత గల ఈ చిత్రం బంగారం తయారుచేసే విధానంతో తెరకెక్కనుంది. యూత్, మాస్ ఎలిమెంట్స్‌తో సస్పెన్స్ చిత్రంగా మలుస్తున్నామని శ్రావణ్ బాపట్ల అన్నారు.

ఇంద్ర మాట్లాడుతూ.. హీరోగా, నిర్మాతగా ఉన్న తాను ఈ చిత్రంలో కథ ప్రకారం రెండు పాత్రలు పోషిస్తున్నానన్నారు. ఇప్పటివరకు 25 రోజుల షూటింగ్ పూర్తయిందని, త్వరలో బ్యాంకాక్‌లో రెండు పాటలను మిగిలిన టాకీని పూర్తిచేస్తామని చెప్పారు.

ఈ సినిమా పాటలు ప్రస్తుతం మిక్సింగ్ దశలో ఉన్నాయని, అన్ని పాటలు బాగున్నాయని సంగీత దర్శకుడు సత్య అన్నారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా: షమ్ము వి, నిర్మాత: బొద్ద ఇంద్రసేన, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రావణ్ బాపట్ల.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: పుత్రుడు, ఇంద్ర, తదనీషా, బిందు, శ్రావణ్ బాపట్ల, సోనియా తివారీ