1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Allu Arjun

Bunny| Allu Arjun| Arya| Schedule| Desamuduru| Danayya| GunaSekar | రామోజీ ఫిలింసిటిలో "బన్ని" కొత్త చిత్రం షెడ్యూల్

రామోజీ ఫిలింసిటి
WD
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, యూనివర్శల్ మీడియా పతాకంపై సూపర్ హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తోన్న తాజా చిత్రం నాలుగో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి డైనమిక్ డైరక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత డి.వి.వి. దానయ్య మాట్లాడుతూ.. రామోజీ ఫిలింసిటిలో కళాదర్శకుడు అశోక్ సారధ్యంలో భారీసెట్ నిర్మించామన్నారు. ఈ సెట్‌లో జూలై 5వ తేదీ నుంచి 30వరకు 30 రోజుల పాటు చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తామని తెలిపారు.

ఏకధాటిగా చిత్రం పూర్తయ్యే వరకు ఈ షెడ్యూల్ జరుగుతుందని నిర్మాత వివరించారు. అల్లు అర్జున్-గుణశేఖర్లు తొలి కాంబినేషన్‌లో అద్భుతమైన సబ్జెక్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తమ బేనర్‌పై ప్రెస్టీజియస్ ఫిల్మ్ అవుతుందన్నారు.

"దేశముదురు" తర్వాత బన్నితో నిర్మిస్తోన్న మరో సూపర్‌హిట్ చిత్రమిదని, అత్యున్నత సాంకేతిక విలువలతో గుణశేఖర్ అద్భుతమైన టేకింగ్‌తో ఈ చిత్రం నిర్మితమౌతోందని దానయ్య తెలియజేశారు.

ఇకపోతే.. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ సరసన ఓ కొత్త కథానాయికను పరిచయం చేస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించడం విశేషం. సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్‌ప్రసాద్‌లతో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫోటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, ఫైట్స్: స్టన్ శివ, ఆర్ట్: అశోక్, ఎడిటింగ్: ఆంథోని.
About Writer
SELVI.M