1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Raja

Inkosari| Raja| Sayali Bagath| Celebration of Life | "సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్‌"గా వస్తోన్న "ఇంకోసారి"

ఇంకోసారి
WD
"రాజా" కథానాయకుడిగా బే మూవీస్‌ పతాకంపై సుమన్‌ పాతూరి దర్శకుడిగా కళ్యాణ్‌ పల్ల నిర్మిస్తున్న చిత్రం 'ఇంకోసారి'.

ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేసేందుకు సారథి స్టూడియోస్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హీరో రాజా మాట్లాడుతూ, ఈ సినిమా టైటిల్‌ చాలా బాగుంది. స్నేహితుల మధ్య ఉండే అనుబంధాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నామన్నారు.

పూర్తిస్థాయి యూత్‌ఫుల్‌ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు అందరూ 30 సంవత్సరాలలోపు వయస్సువారే పనిచేయడం వల్ల కెమిస్ట్రీ బాగుందని రాజా తెలిపారు. ఇప్పటికే సినిమా సెషన్ చూశామని, చాలా ఫ్రెష్‌గా ఉందని, సుమన్‌ అద్భుతమైన దర్శకుడవుతాడని ఆయన కితాబిచ్చారు.

నిర్మాత కళ్యాణ్‌ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం రేపటి నుండి సయాలి భగత్‌పై ఓ పాట చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఈ సినిమా కథ గురించి చెప్పవలసి వస్తే దీన్ని "సెలబ్రేషన్స్‌ ఆఫ్‌ లైఫ్‌" అనవచ్చునన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరూ సినిమా చాలా బాగా వచ్చిందని దర్శకుడికి మంచి గుర్తింపు వస్తుందని ఆశించారు.
About Writer
SELVI.M