1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Sivaji

Actor Brusli| Sivaji| Suman| Enter the Dragon| Marshall Arts | నమ్మలేని నిజం "బ్రూస్లీ": సుమన్‌

బ్రూస్లీ
WD
ప్రపంచంలో నమ్మలేని నిజాల్లో బ్రూస్లీ ఒకరని విలక్షణ నటుడు సుమన్‌ అంటున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రమేయం బ్లాక్ బెల్ట్‌ హోల్డర్ అయిన సుమన్‌ 'శివాజీ' చిత్రంలో రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత ఆయనకు అటువంటి తరహా పాత్రలే వచ్చాయి.

ఈ నేపథ్యంలో సుమన్ మాట్లాడుతూ.. తనకు బ్రూస్లీ ఎంతో స్పూర్తి అని చెప్పారు. అప్పట్లో మార్షల్‌ ఆర్ట్స్‌కు పెద్దగా ప్రాధాన్యతలేదు. బ్రూస్లీ స్టిల్స్‌ చూసి ఈయనేంటి..? రెండు కర్రలను చేతులతో పట్టుకుని. ఫోజిస్తాడు.? అనుకున్నామని ఆయన తెలిపారు.

బ్లూస్లీ 'ఎంటర్‌ ది డ్రాగన్‌' విడుదలయ్యాక ఈ సినిమాను రోజుకు కనీసం రెండుసార్లు చూసేవాడిని. అప్పట్లో అది వారం రోజుల వరకు పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత నిలదొక్కుకుని ఇండియా మొత్తం సెన్సేషనల్‌ హిట్‌ అయ్యిందని సుమన్ గుర్తు చేశారు.

మనిషిలో ఇంత పవర్‌ ఉంటుందా? అని బ్రూస్లీ నిరూపించాడనీ, మార్షల్‌ ఆర్ట్స్‌ను వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి తెలియజేసింది బ్రూస్లీలేనని సుమన్‌ చెప్పారు.
About Writer
SELVI.M