1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Film School

RamaNaidu| Film School| Applications| Suresh Babu| Oscar | రామానాయుడు ఫిలిం స్కూల్‌కు దరఖాస్తులు ఆహ్వానం

రామానాయుడు
WD
రామానాయుడు ఫిలింస్కూల్‌ 2వ బ్యాచ్‌లో దర్శకత్వం, స్క్రిప్ట్‌వర్క్‌తోపాటు సినిమాటోగ్రఫీ కోర్సుకు అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సురేష్‌బాబు మాట్లాడుతూ, 'రామానాయుడు స్కూల్‌.డామ్‌' వెబ్‌సైట్‌లో దరఖాస్తులు పొందవచ్చునని చెప్పారు.

పూర్తిచేసిన దరఖాస్తులను ఈనెల 22వతేదీలోగా సమర్పించాలని డి.సురేష్‌బాబు తెలియజేశారు. భవిష్యత్‌లో యాక్టింగ్‌, ఎడిటింగ్‌తోపాటు ఇతర క్రాఫ్ట్‌లకు చెందిన కోర్సులనుకూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 15 నెలల కోర్సుకు 3లక్షల రూపాయలు ఖర్చవుతుందనీ, ప్రతిభను బట్టి స్కాలర్‌షిప్‌‌లుకూడా ఉంటాయన్నారు.

ఫిలింస్కూల్‌లో నేర్చుకుని తద్వారా సినిమా రంగంలోకి ప్రవేశిస్తే నటనలో ఎనలేని అనుభవం వస్తుందనే విషయం ఈ స్కూల్‌ నడుపుతున్న తనకు అనుభవపూర్వకంగా తెలిసిందని సురేష్ బాబు చెప్పారు. ఇన్నాళ్ళు ఏమీ తెలీకుండానే సినిమాలు నిర్మించాను. ఇప్పుడు స్కూల్లో విద్యార్థులను చూస్తుంటే.. తెలియాల్సింది చాలా ఉందనిపిస్తుందని సురేష్‌బాబు పేర్కొన్నారు.

ఫిలిం స్కూల్‌ద్వారా సినీరంగంలోకి ప్రవేశించిన నటుల ప్రతిభతోనే భవిష్యత్‌లో మనం అంతర్జాతీయస్థాయికి ధీటుగా ఎదగగలమని, అప్పుడే ఆస్కార్‌కు పోటీ ఉంటుందని చెప్పారు.
About Writer
SELVI.M