1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Europe

Magadheera| Europe| Kajal| Ramcharan| Rajamouli| Allu Aravind | యూరప్‌లో "మగధీర"

మగధీర
WD
"చిరు"తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, సూపర్ సక్సెస్‌ఫుల్ డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "మగధీర".

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న "మగధీర" ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందని, సేల్స్ పరంగా రికార్డులు సృష్టిస్తోందని ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా చెప్పారు.

కాగా ఈ చిత్రంలోని "నాకోసం నువ్వు.. అని సాగే పాటను రామ్‌చరణ్, కాజల్‌పై యూరప్‌లో ఈ నెల 7వ తేదీ నుండి చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణతో మగధీర షూటింగ్ పూర్తవుతుంది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్న ఈ మెగామూవీని అత్యధిక ప్రింట్లతో ప్రపంచమంతటా జూలై నాలుగోవారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి కథ: వి.విజయేంద్రప్రసాద్, మాటలు: ఎం.రత్నం, సంగీతం: ఎం.ఎం. కీరవాణి, ఫోటోగ్రఫీ: కె.కె. సెంథిల్ కుమార్, స్టైలింగ్: రమా రాజమౌళి, ఆర్ట్: రవీందర్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.

ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్, ఛీఫ్ కో-డైరక్టర్: జె.వి.వి. సత్యనారాయణ, కో-డైరక్టర్: పేటకోటి, ప్రొడక్షన్ కంట్రోలర్: డి.యోగానంద్, నిర్వహణ: బాబు, సహనిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, నిర్మాత: అల్లు అరవింద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి.
About Writer
SELVI.M