1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Iliyana

NTR| Iliyana| Aswanidath| Rakhi| Mehar Ramesh| Kantri | "రాఖీ" హీరోయిన్‌తో మళ్లీ జతకట్టనున్న ఎన్టీఆర్!

ఎన్టీఆర్
WD
నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా "కంత్రి" ఫేం మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

"రాఖీ" సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన అందాల తార ఇలియానా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు ముఖ్యపాత్రల్ని పోషిస్తారు.

ఈ చిత్రం గురించి ఎన్టీఆర్ మాట్లాజుతూ.. మెహర్ రమేష్ చెప్పిన కథ చాలా బాగుందని, దత్తు పతాకంపై మళ్లీ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

నిర్మాత సి. అశ్వనీదత్ మాట్లాడుతూ.. వైజయంతీ సంస్థ నిర్మించిన అన్ని చిత్రాల్లోనూ బ్యాక్‌డ్రాప్ వైవిధ్యంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. తారక్‌తో చేస్తున్న ఈ చిత్రం స్టార్టింగ్ నుంచి ఎడిటింగ్ వరకు డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో గ్రాండ్ లొకేషన్స్‌లో చిత్రీకరించడం జరుగుతుందని వివరించారు. తారక్‌-మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వైజయంతీ పతాకంపై వస్తోన్న మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇదని నిర్మాత తెలిపారు.

దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ.. "కంత్రి" వంటి హిట్ చిత్రం తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో అశ్వనీదత్‌ పతాకంపై చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సబ్జెక్ట్ వినగానే తారక్, అశ్వనీదత్ ఎక్స్‌ట్రార్డనరీగా ఉందని అభినందించారు.

తారక్‌తో వైజయంతీ బ్యానర్‌లో ఓ సెన్సేషనల్ హిట్ సినిమా అవుతుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంగీతం: మణిశర్మ, ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కృష్ణ, సమర్పణ: చలసాని ధర్మరాజు, నిర్మాత: సి. అశ్వనీదత్, కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: మెహర్ రమేష్.
About Writer
SELVI.M