Ningi Nela Nade| Game Show| Saina Nehwal| Pranitha | "నింగి నేల నాదే" గేమ్‌షో ప్రారంభం
|
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని పాటలు వింటుంటే తనలోని దృఢసంకల్పాన్ని తట్టిలేపుతుందన్నారు. ఇందులో కొన్ని సన్నివేశాలు కంటతడిపెట్టించాయని, యువత ఈ చిత్రాన్ని చూస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని మంత్రి వివరించారు.
ముఖ్యమంత్రితో సంప్రదించి ఈ చిత్ర ప్రమోషన్ కోసం పాఠశాల, కళాశాలల్లో 'నింగి నేల నాదే' చిత్రాన్ని ప్రదర్శించే ఏర్పాట్లను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి హాజరైన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. ఆటల్లో పోటీని ఎదుర్కోవాలంటే ఎలాంటి సంకల్పం ఉండాలో అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి ఈ చిత్రంలో హీరోయిన్ చేసిన పోరాటాలు కళ్లకు కట్టినట్లు చూపించారని చెప్పింది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే తనకు ఈ చిత్రం ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆమె తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఇటీవలే యాసిడ్ దాడికి గురై మృత్యుంజయురాలైన ప్రణీత ఈ చిత్రానికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మొక్కువోని దీక్షతో ప్రణీత ఇంజనీరింగ్‌లో డిస్టింక్షన్ తెచ్చుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఓ ఎన్.ఆర్.ఐ ఆమెకు లాప్‌టాప్‌ను బహూకరించారు. దాన్నిచిత్ర నిర్మాత చావా సుధారాణి, మంత్రి చేతులమీదుగా అందజేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థులు మాట్లాడారు. చిత్రాన్ని చూసి చలించిన కొంతమంది ప్రేక్షకులు కూడా తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. ఇంకా వెన్నెలకంటి, హైదరాబాద్ స్కూల్స్ అధ్యక్షురాలు సంగీతావర్మ మాట్లాడుతూ.. ఇటువంటి చిత్రాలు యువతకు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కిచెప్పారు.