Raju Maharaju| Mohan Babu| Sarvanand| Chakri| Kumaraswamy | నిర్మాతకు హ్యాండ్ ఇచ్చిన చక్రి
|
ఆయన కోసమే ఏర్పాటు చేసిన ఈ వేడుకకు ఆయన డుమ్మా కొట్టడంతో తనను చాలా బాధించిందని చిత్ర నిర్మాత కుమారస్వామి ఆవేదన చెందారు. ఉదయం నుంచి వస్తానని చెప్పి ప్రోగ్రామ్ కూడా ఫిక్స్‌చేయించి ఇప్పుడు రాకపోవడం పట్ల తాను కలత చెందానన్నారు.
వివరాల్లోకి వెళితే.. ఈ చిత్ర ప్రమోషన్‌లో మోషన్‌బాబు సహకరించకపోవడం తెలిసిందే. ఈ కోవలో తాజాగా చక్రి కూడా చేరారు. చక్రి ఈ చిత్రానికి సంగీతం ఇవ్వడానికి చాలా వ్యవధి తీసుకున్నాడట.
చిత్రం రిలీజ్‌కు ముందు రీరికార్డింగ్ చేసే టైమ్‌లో వేరే పని ఉందని అమెరికాలో వెళ్లాడు. చెప్పిన టైమ్‌కు రాకపోవడంతో నిర్మాత విసిగెత్తి రీరికార్డింగ్‌ను మరో సంగీత దర్శకుడి చేత చేయించారు. దీంతో ఆయన అలక చెందినట్లు తెలిసింది.
ఈ విషయమై చక్రిని వివరణ కోరగా... సోమవారం రాత్రి విపరీతమైన ట్రాఫిక్ జామ్ వల్ల తాను రాలేకపోయాననీ, అందులోనూ రికార్డింగ్ పనిలోనూ బిజీగా ఉన్నానని సెలవిచ్చాడు. ఏది ఏమైనా పేరున్న టెక్నీషిన్స్‌తో కొత్త నిర్మాతలు పనిచేయించడం కష్టమని ఇండస్ట్రీ భావిస్తోంది.