Evaraina Epudaina| AVM| Varun Sandesh| Vimala Raman | ''ఎవరైనా ఎప్పుడైనా'' సక్సెస్ మీట్
|
ఈ సందర్భంగా.. చిత్ర దర్శకుడు మార్తాండ్ శంకర్ మాట్లాడుతూ, ఎవీఎం. వంటి ప్రతిష్టాత్మక బేనర్‌లో తొలి చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. కథ, కథనం పట్ల నిర్మాతలు మురుగదాసన్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
చిత్ర హీరో వరుణ్‌సందేశ్ మాట్లాడుతూ, గత రెండు చిత్రాలకంటే కొత్తకథనంలో ఈ చిత్రం రూపొందిందని, నటునిగా తనకు గుర్తింపు సంపాదించి పెట్టిందన్నారు. ఇందులో బాగా చేశావని చాలామంది అంటుంటే మరింత ఉత్సాహమేసింది అని చెప్పారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, రిలీజ్‌నాడే హైదరాబాద్ శాంతిథియేటర్‌లో చూశాను. డిస్ట్రిబ్యూటర్లంతా హ్యాపీగా ఉన్నారు. వినోదప్రదానంగా సాగిన ఈ సినిమాలో చక్కని సెంటిమెంట్‌కూడా ఉందని తెలిపారు.