1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kowsik

Anaganaga Oka Aranyam| Kowsik| Audio| Jeevitha Rajasekhar | పరిశోధన నేపథ్యంలో "అనగనగా ఒక అరణ్యం"

అనగనగా ఒక అరణ్యం
కౌశిక్ హీరోగా టి. సుల్తాన్‌ నిర్మించిన ' అనగనగా ఒక అరణ్యం' చిత్రం కొంతమంది విద్యార్థుల పరిశోధన నేపథ్యంలో సాగుతోంది. ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర దర్శకుడు. పోస్ట్‌ప్రొడక్షన్స్‌ పూర్తయిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే జరిగింది.

ప్రముఖ నటి జీవిత రాజశేఖర్‌ ఈ సినిమా ఆడియోను విడుదలచేశారు. ఈ చిత్రం విజయవంతం కావాలనీ, సీనియర్‌ దర్శకుడు పి.సి.రెడ్డి శిష్యులు నిర్మించిన ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని జీవిత ఆకాంక్షించారు.

నిర్మాణ సారథి బాబ్జీ మాట్లాడుతూ, ఈ చిత్ర నిర్మాత తన గురువైన పి.సి.రెడ్డి దగ్గర ఎర్రసూరీడుకు పనిచేశాడు. ఆ తర్వాత ఆయనే తనను దర్శకునిగా పరిచయం చేస్తూ 'నల్లపూసలు' చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రానికి కోడైరెక్టర్‌గా పనిచేసిన శేఖర్‌చంద్ర అనగనగా ఒక అరణ్యం చిత్రానికి దర్శకునిగా మారాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

పి.సి.రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్ర నిర్మాత సుల్తాన్‌ తన సినిమాల్లో నటించారు. జీవిత కూడా చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు తన సినిమాల్లో నటించింది. ఇంతమంది ఆత్మీయుల మధ్య ఆడియో జరగడం ఆనందంగా ఉందన్నారు.

కథానాయకుడు కౌశిక్ మాట్లాడుతూ, ఈ సినిమా ఓ దండకారణ్యంలో తీశారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. సినిమా చేస్తున్నంతసేపు తనకు ఎన్‌సిసి క్యాంప్‌లా సాగినట్లుందని తెలిపారు.

దర్శకుడు శేఖర్‌ చంద్ర మాట్లాడుతూ, ఈ సినిమాకు నిర్మాతే సంగీతాన్ని సమకూర్చారు. ఆయన నుంచి రావాల్సిన ట్యూన్స్‌ రాబట్టుకున్నానని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల అనుభవంతో ఈ చిత్రాన్ని నిర్మించి సంగీతం సమకూర్చాను. గతంలో 'బ్లూ' అనే సినిమాను తీశాను. దానికి నంది అవార్డుకూడా వచ్చింది ఈ చిత్రంలో పాటలన్నీ బాగున్నాయని విన్నవాళ్లు చెప్పారు. త్వరలో సినిమాను విడుదలచేస్తామని చెప్పారు.
About Writer
SELVI.M