1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Small Screen

Cinema| Small Screen| Pokiri| Mahesh Babu| Namrata Shirodkar | బుల్లితెరపై "పోకిరి" సతీమణి నమ్రతా!

సినిమా
WD
టాలీవుడ్ ప్రిన్స్, పోకిరి మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ బుల్లితెరపై ప్రత్యక్షం కానుంది. పెండ్లికిముందు యువరాజుతో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నమ్రత పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పింది.

తాజాగా వ్యాపకం కోసం నిర్మాతగా మారి బుల్లితెరకు దగ్గరవుతోంది. ఇందులో భాగంగా... ఓ బుల్లితెర షోను ఆమె నిర్మించనుంది. మరాఠీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ కోసం ఈ షో రూపకల్పన జరుగుతోందని నమ్రత తెలిపింది. మరాఠీ తన మాతృభాష కావడంతో తొలిసారి ఈ వెంచర్‌ చేపడుతున్నట్లు పేర్కొంది. వివాహానంతరం సినిమాలకు స్వస్తి చెప్పిన సోదరి శిల్పా శిరోద్కర్‌తో కలిసి నమ్రత ఈ షో జడ్జిగా వ్యవహరించనుండటం విశేషం.

ఈ విషయాన్ని నమ్రత ధ్రువీకరిస్తూ, పిల్లల కోసం చేసే ఈ డ్యాన్స్‌ రియాల్టీ షోలో తానూ, శిల్పా కలిసి తొలిసారి కనిపించటం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు. ఈ షో కోసం తరచూ ముంబై వెళ్లవలసి ఉన్నప్పటికీ అది ఇంటికి దూరమైనట్టు కాదని, ప్రస్తుతం షూటింగ్‌ అంతా హైదరాబాద్‌లోనే ప్లాన్‌ చేస్తున్నామని చెప్పుకొచ్చింది.

టీవీషోలో నమ్రత తొలిసారి రంగప్రవేశం చేస్తున్న తరుణంలో మునుముందు మరింత బిజీ అయ్యే అవకాశాలపై ప్రశ్నించినప్పుడు, మరిన్ని షోలు చేయాల్సిందిగా పలు ఛానల్స్‌ కోరుతున్నాయని, అయితే ప్రస్తుతం అవన్నీ చర్చల దశలోనే ఉన్నందున త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని నమ్రత తెలిపింది.
About Writer
SELVI.M