1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Current

Sushanth| Current| Sneha Ullal| Scene| Kalidas| Sensor | సుశాంత్ "కరెంట్‌"‌లో ఆ సీన్‌పై అభ్యంతరం!

సుశాంత్
WD
నాగార్జున మేనల్లుడు, కాళిదాసు ఫేమ్ "సుశాంత్‌" హీరోగా నటించిన చిత్రం 'కరెంట్‌'. ఈ చిత్ర యూనిట్‌ నిర్వహించిన 'కనెక్టింగ్‌ హార్ట్స్‌' యాత్రకు ఉత్తరాంధ్రలో ఘనస్వాగతం లభించింది. ఇందులో భాగంగా కడప, ప్రొద్దుటూరులలో చిత్ర యూనిట్ పర్యటించింది.

అయితే అక్కడ కొంతమంది "కరెంట్‌"లో సుశాంత్‌, హీరోయిన్‌ స్నేహ ఉల్లాల్‌ బొడ్డుపై ఏదో రాస్తున్నట్లు వేసిన పోస్టర్లపై అభ్యంతరం తెలిపారు. ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో అక్కడి అక్కినేని అభిమానులకు, వారికి మధ్య ఘర్షణ తలెత్తింది.

ఈ విషయమై నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇదంతా పబ్లిసిటీలో భాగమేనని అందులో తప్పేమిలేదని నచ్చచెప్పారు. అవసరమైతే మీ అందరికీ మరోసారి షో వేసి చూపిస్తామనీ, సినిమాలో అభ్యంతరమని భావిస్తే తీసేస్తామని అని కూడా తెలిపారు. దీంతో వారంతా సర్దుకున్నారని నిర్మాత చింతలపూడి అన్నారు. కరెంట్ సినిమాలో ఆ ఒక్క సీన్ మినహా మిగిలినచోట్ల ఎక్కడా ఇటువంటి సెన్సార్ ఇబ్బంది కలగలేదని శ్రీనివాసరావు తెలిపారు.

అక్కినేని అభిమానులంతా మళ్ళీ సుశాంత్‌తో 3వ సినిమాను నిర్మించమని తనను కోరారని, మంచి కథ లభిస్తే చేస్తానని నిర్మాత హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. శ్రీనాగ్‌ కార్పొరేషన్‌ నిర్మాణసంస్థ సహకారంతో ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు నిర్మించారు. ఈ సినిమాకు నాగ సుశీల మరో నిర్మాత.
About Writer
SELVI.M