Cinema| Geethanjali| OYE| Nagarjuna| Siddharth| Shamili | ''గీతాంజలి''కి- ''ఓయ్''కి పోలికుంది: నాగార్జున
|
ఈ విషయాన్ని సిద్దార్థ చెబుతూ... తాను నటించిన 'ఓయ్' చిత్రాన్ని నాగార్జున చూసి గీతాంజలితో పోలుస్తున్నారని ఇండస్ట్రీలో చాలామంది తనకు తెలియజేసినట్లు చెప్పారు.
నాగార్జున అన్నమాటకు మళ్లీ "ఓయ్" సినిమాను చూశానని సిద్ధార్థ వెల్లడించారు. గీతాంజలికి, ఓయ్‌కి ఒక విషయంలో పోలిక ఉందని నాగార్జున తనతో చెప్పారని సిద్ధార్థ తెలిపారు.
అదేమిటంటే..? గీతాంజలి రిలీజ్ అయిన తర్వాత అంతా ప్లాప్ అన్నారు. ఆ తర్వాత పికప్ అయి రికార్డు సృష్టించింది. అయితే "ఓయ్" చిత్రానికి ఓపెనింగ్సే బ్రహ్మాండంగా ఉన్నాయని, సినిమా బాగుందనే టాక్ వచ్చిందని నాగార్జున ఓయ్ హీరోతో చెప్పినట్లు సిద్ధార్థ వెల్లడించారు. ఇక "ఓయ్" చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని సిద్ధార్థ ఆశాభావం వ్యక్తం చేశారు.