NagaChitanya| Karthika| Josh| Dil Raju| Nagarjuna| Vasu Varma | నాగచైతన్య, కార్తీక జంటగా "జోష్"
|
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు పాటలు కొద్దిగా ప్యాచ్‌వర్క్ మినహా చిత్రం పూర్తయిందని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత దిల్‌రాజు వెల్లడించారు. తమ పతాకంపై అన్ని హిట్ సినిమాలే వచ్చాయని, ఇదికూడా హిట్ అయితే 3వ హ్యాట్రిక్ సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు.
నాగార్జున ఇటీవలే ఈ చిత్రాన్ని చూసి సూపర్ హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారని నిర్మాత చెప్పారు.
మిగిలిన రెండు పాటల్లో ఒకటి స్విట్జర్లాండ్‌లోనూ, రెండోది హైదరాబాదులోనూ చిత్రిస్తామని దిల్‌రాజు తెలిపారు. ఈ నెల 18వ తేదీన "జోష్" ఆడియోను, ఆగస్టులో సినిమాను రిలీజ్ చేస్తున్నామని ఆయన వివరాలందించారు.