1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Meena

Tirumala| Meena| Marriage| VidyaSagar| Kollywood| Tollywood | తిరుమలలో వైభవంగా మీనా వివాహం

తిరుమల
బాలనటిగా తెరంగేట్రం చేసి, చిత్రసీమలో ప్రవేశించిన అందాల నటి మీనాకు ఆదివారం వివాహం వైభోగంగా జరిగింది. 1990లో "సీతారామయ్య గారి మనుమరాలు" చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన మీనా, తదనంతరం కోలీవుడ్, టాలీవుడ్‌లలో అగ్రహీరోయిన్‌గా ముద్ర వేసుకుంది. తాజాగా ప్రముఖ నిర్మాత దొరస్వామిరాజు నిర్మించిన "వెంగమాంబ" చిత్రంలో మీనా నటించింది. ఈ సినిమా ఈ నెల 17వ తేదీన తెరపైకి రానుంది.

ఈ నేపథ్యంలో తిరుమలలోని ఆల్ ఇండియా ఆర్యవైశ్య సమాజ సత్రంలో బెంగళూరులో స్థిరపడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కె. విద్యాసాగర్‌తో మీనా వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీతారలు రాగిణి, కృష్ణవేణి, సంఘవి తదితరులు హాజరయ్యారు.

నీలాకాశం రంగు పట్టుచీర, తక్కువ ఆభరణాలతో మీనాకు పెళ్లికళ ఉట్టిపడింది. జీలకర్ర, బెల్లం కార్యక్రమం తర్వాత మంగళవాయిద్యాల నడుమ శుభముహూర్తాన వరుడు విద్యాసాగర్ మీనా మెడలో మూడుముళ్లు వేశారు.

వివాహానంతరం ఈ నెల 14వ తేదీన చెన్నై రామనాథన్ చెట్టియార్ సెంటర్‌లోని వల్లిమలై హాలులో మీనా వివాహా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మొక్కుబడి ఉన్న కారణంతోనే తిరుమలలో మీనా వివాహం జరిపించామని మీనా తల్లిదండ్రులు దొరైరాజ్, మల్లికా దొరైరాజ్‌లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం చిత్రరంగాల్లో అగ్రనటిగా ముద్రవేసుకున్న మీనా అన్ని దక్షిణాది భాషల్లోనూ నటించింది. తమిళ చిత్రరంగంలో 1991 నుంచి 2000వరకు సుమారు దశాబ్దం పాటు అగ్రతారగా నిలిచింది. కోలీవుడ్, టాలీవుడ్‌లలో అగ్రహీరోల సరసన మీనా నటించింది.
About Writer
SELVI.M