1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. cinema

Arti agarwal | cinema | tollywood | Arti father | ఆర్తీ వెంటే లక్కీడాడీ!

ఆర్తీ అగర్వాల్
WD
సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ప్రవేశించిన ఆర్తీ అగర్వాల్‌ తండ్రి చాటు బిడ్డ అయింది. ఎక్కడికి వెళ్ళినా తన తండ్రిని వెంటబెట్టుకుని వెళుతోంది. షూటింగ్‌ జరిగేటప్పుడు సైతం ఆయన దగ్గరుండాల్సిందే. ఫొటో సెక్షన్స్‌కూడా ఆమె చేయిపట్టుకుని తీసుకెళుతుండాడు. సోమవారం కూడా ఇలాగే జరిగింది.

మధ్యాహ్నం బ్రేక్ ఇచ్చిన దర్శకుడు భరత్‌.. ఆ తర్వాత ఆర్తీని షాట్‌కు సిద్ధపడమని కోడైరెక్టర్‌కు చెప్పాడు. కాసేపటికి తండ్రి చేయిపట్టుకుని వచ్చిన ఆర్తీ.... లక్కీ డాడ్‌.. అంటూ... సీన్‌ వినిపించే సందర్భం నుంచి షాట్‌ వెళ్ళేవరకు పక్కనే ఉండాలని తన తండ్రిని కోరింది. దానికి దర్శకుడు ఓకే అన్నారు.

అంతకుముందే మీడియా సమావేశంలో ఆర్టిస్టులందరూ పాల్గొనే సమావేశంలోనూ... లక్కీ డాడ్‌.. రావాలంటూ.. పట్టుబట్టింది. దాంతో దర్శకుడు ఆయన్ను పిలిపించి ఆమె పక్కనే కూర్చొబెట్టారు. గతంలో ఆర్తీ మేడమెట్లుపైనుంచి కిందపడింది. అప్పటి నుంచీ ఆమెలో కాస్త మార్పు కనబడుతోందని ఇండిస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అది ఎటువంటి మార్పో...?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT