1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Ramcharan

Magadheera | Ramcharan | Chiranjeevi | release date | | ''మగధీర''ను చూసి మెగాస్టార్ షాక్!

మగధీర
WD
మెగాస్టార్‌ తనయుడు రామ్‌చరణ్‌ తేజ నటించిన ద్వితీయ చిత్రం 'మగధీర' పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలకు బ్రేక్ పడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో యుద్ధప్రాతిపదికన డబ్బింగ్‌,ఎడిటింగ్‌, మిక్సింగ్‌, గ్రాఫిక్స్ వర్క్‌ జరుగుతున్నాయి.

ఇటీవలే వెల్లడించిన ప్రోగ్రెస్‌ ప్రకారం ఈనెలాఖరులో సినిమాను విడుదల చేయాల్సి ఉంది. కానీ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత విభావరిలో పాల్గొనే నిమిత్తం విదేశాలకు వెళ్ళారు. ఈనెల 28న అక్కడ ప్రోగ్రామ్‌ ఉంది. మరోవైపు రాజమౌళి కూడా మరో పనిమీద అమెరికా వెళ్ళినట్లు సమాచారం.

రీరికార్డింగ్‌ కార్యక్రమాలు సవ్యంగా జరగాలంటే.. కీరవాణి రావాల్సిఉంది. మరోవైపు రాజమౌళి సెంటిమెంట్‌ రీత్యా ఆగస్టు రెండవారంలో 'యమదొంగ' రిలీజైంది కాబట్టి అదేరోజు మగధీరను విడుదలచేయాలనే ఆలోచలో ఉన్నట్లు ఇండిస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే అనకున్న టైమ్‌కు మగధీర రెడీకాలేదని తెలిసింది.

ఇదిలా ఉండగా... మెగాస్టార్‌ చిరంజీవి "మగధీర" చిత్రాన్ని చూసి షాక్‌కు గురయ్యారని తెలిసింది. పునర్జన్మ నేపథ్యంలో రూపొందిన ఈ కథను ఎంతవరకు జనాలు ఆదరిస్తారనేది ఒక సందేహమయితే... ఎన్‌.టి.ఆర్‌.ను 'సింహాద్రి' తరహాలో చూపించాక మళ్ళీ అతనితో సినిమాలు చేయాలంటే, కథలు రాయాలంటే ఇండిస్ట్రీ మేథావులు గందరగోళ పడ్డారు. మళ్లీ అంత రేంజ్‌లో ఎన్‌.టి.ఆర్‌.కు హిట్‌ రాలేదు.

ఒక్కసారే తాను సింహాద్రి సినిమాను చేయడం పొరపాటే అని ఆ తర్వాత ఎన్‌.టి.ఆర్‌.కూడా వ్యాఖ్యానించారు. తాజా వివరాలను ప్రకారం మగధీర కూడా రామ్‌చరణ్‌ను ఎక్కడికో తీసుకెళుతుందని ఆ తర్వాత చిత్రాలు దాని తలదన్నేట్లు ఉండాల్సిన అవసరం ఉంటుందని మెగాస్టార్‌ ఆలోచనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మరోవైపు మగధీర చిత్రం రూ. 30 కోట్ల బడ్జెట్‌ అని తెలిసింది. ఇప్పటికే దాన్ని మార్కెట్‌ చేసేశారు. దాదాపు 5 కోట్ల డెఫిషిట్స్‌తో విడుదల చేయాల్సి వస్తుంది. దాన్ని కవర్‌ చేయాలంటే... విపరీతంగా థియేటర్లు పెంచేసి వారంలో రాబట్టుకోవాలని అల్లు అరవింద్‌ యోచిస్తున్నట్లు ఫిలింనగర్‌ టాక్.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT