1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Ek Niranjan

Prabhas| Ek Niranjan| Kangana Ranaut| Puri Jagannath | బ్యాంకాక్‌లో ప్రభాస్ "ఏక్ నిరంజన్"

ప్రభాస్
WD
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "ఏక్ నిరంజన్". ఆదిత్యారామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్, డైనమిక్ ప్రొడ్యూసర్ ఆదిత్యారామ్ భారీ ఎత్తున ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న "ఏక్‌నిరంజన్" సినిమా జూలై 12 నుంచి బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

హిందీ "ఫ్యాషన్" కథానాయిక కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లో 12 రోజుల పాటు పలు అందమైన లొకేషన్స్‌లో హీరో ప్రభాస్, కంగనా రనౌత్‌లపై రెండు పాటలను చిత్రీకరించామన్నారు. నెలరోజుల పాటు జరిగే ఈ భారీ షెడ్యూల్‌లో చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని నిర్మాత తెలిపారు.

బ్యాంకాక్ షెడ్యూల్ తర్వాత హైదరాబాదులో మిగిలిన పనులను పూర్తి చేస్తామని ఆదిత్యారామ్ తెలిపారు. సెప్టెంబర్ కల్లా ఏక్ నిరంజన్ సినిమా షూటింగ్ పూర్తవుతుందని ఆయన వివరాలందించారు. ప్రభాస్ నటన, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తమ బేనర్‌పై రూపుదిద్దుకుంటున్న "ఏక్ నిరంజన్" బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు

సోనూ సూద్, ముకుల్ దేవ్, మకరన్ దేశ్‌పాండే, బ్రహ్మానందం, అలీ, సునీల్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, సంగీత, పోసాని కృష్ణమురళి, సత్యప్రకాష్, శ్రావణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫోటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, ఫైట్స్: స్టన్ శివ, స్టిల్స్: రాజా, కో-డైరక్టర్: సత్యప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: భాస్కర రాజు, ప్రొడక్షన్ కంట్రోలర్: తాండవకృష్ణ.
About Writer
SELVI.M