1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. celina Jaitly

gay sex | celina Jaitly | Baba Ramdev | | గే సెక్స్ వ్యాధా...? రాందేవ్‌పై సెలీనా చిటపట

స్వలింగ సంపర్కం
స్వలింగ సంపర్కం ఓ వ్యాధి అనీ, దానిని తను నయం చేస్తానని యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ సెక్సీనటి సెలీనా చిటపటలాడింది. స్వలింగ సంపర్కంపై రాందేవ్ అభిప్రాయాలు అర్థం లేనివని తోసిపచ్చింది.

రాందేవ్ చెప్పినట్లు స్వలింగ సంపర్కం అనేది వ్యాధి కాదనీ, అలా అని స్వలింగ సంపర్కులు భావించడం లేదని చెప్పింది. కనుక వ్యాధిలేనివారికి జబ్బు నయం చేస్తానంటూ బాబా ముందుకురావడం అర్థంలేని పనే అవుతుందని ఎద్దేవా చేసింది.

యోగా నేర్చుకునేందుకు ఉత్సాహం చూపేవారికి రాందేవ్ యోగా నేర్పుకోవచ్చని, కానీ స్వలింగ సంపర్కులు ఎలా తినాలో, ఎలా పడుకోవాలో, ఎలా నడచుకోవాలో చెబితే వినేందుకు స్వలింగ సంపర్కులు సిద్ధంగా లేరని ఘాటుగా స్పందించింది సెలీనా.

కాగా సెలీనా వ్యాఖ్యలపై బాబా స్పందిస్తూ... సెలీనా వంటివారికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, నైతిక విలువలు ఏమాత్రం తెలియవని, అటువంటివారు మాట్లాడితే తాను పట్టించుకోబోనన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT