Gopichand| Trisha| Sankham| Sydney| Songs| Shooting | సిడ్నీ చుట్టొచ్చిన గోపిచంద్, త్రిషల ''శంఖం''
గోపీచంద్, త్రిష సిడ్నీలోని అందమైన లొకేషన్లలో పాటలు పాడుకుని తిరిగి వచ్చారు. చలి ఎక్కువగా ఉన్న సమయంలో పాటలు ముగించుకుని తిరిగి వచ్చారు.
వీరికి ఈ అవకాశాన్ని 'శంఖం' నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు కల్పించారు. శివ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆస్ట్రేలియాలో జూన్ 21 నుంచి జులై 9వరకు "శంఖం" చిత్రంలోని రెండు పాటలను, కథకు కీలకమైన కొన్ని ప్రధాన దృశ్యాలను చిత్రీకరించారు.
ఈ సందర్భంగా జె. పుల్లారావు మాట్లాడుతూ, 20రోజులపాటు సిడ్నీ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామన్నారు. చలి విపరీతంగా ఉన్నప్పటికీ ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 4గంటలలోగా ప్రణాళికలో గల సన్నివేశాలను షూట్ చేశామని చెప్పారు.
దర్శకుడు శివ చెబుతూ, సిడ్నీ షెడ్యూల్తో "శంఖం" 90 శాతం షూటింగ్ పూర్తయిందని తెలిపారు. మరో పాటను కొంత టాకీని పూర్తిచేస్తే చిత్రం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టులో ఆడియోను విడుదలచేస్తామని దర్శకుడు వెల్లడించారు.
గోపీచంద్‌తో 'శౌర్యం' తర్వాత మళ్ళీ ఒక మంచి కథను సినిమా రూపొందించడం సంతోషంగా ఉందని దర్శకుడు వెల్లడించారు. ఈ సినిమా అందరికీ మంచి గుర్తింపు సంపాదించి పెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంకా తమిళ నటుడు సత్యరాజ్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెట్రి, సంగీతం: తమన్, మాటలు: అనిల్ రావిపూడి.