"అష్టాచమ్మా" సినిమా ద్వారా యాంకర్ కలర్స్ స్వాతి హీరోయిన్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా 'కలవరమాయే మదిలో' చిత్రంలో ఆమె నటించింది. సంగీత ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో ఆమె నటన అద్భుతమని ఇండస్ట్రీ భావిస్తోంది. ఇటీవలే బయ్యర్లకు ఆ చిత్రాన్ని చూపించారు. ఆ చిత్రం చూశాక అందరూ స్వాతిని మెసేజ్‌లు, ఫోన్‌ల ద్వారా అభినందించారట.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో దర్శకుడు సతీష్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల నిర్మించారు.
ఇటువంటి చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని కలర్స్ స్వాతి చెప్పింది. ఈనెల 17న విడుదలకానున్న ఈ చిత్రాన్ని ముందుగానే మెచ్చుకోవడం కూడా ఒకింత భయంగా ఉందని స్వాతి చెప్పింది.
ఇకపోతే.. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని హీరో కమల్‌కామ్‌రాజ్, చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.