Airtel| Single Brand Cineplex| Vimala Raman| Varun Sandesh | జూబ్లీహిల్స్‌లో "సింగిల్ బ్రాండ్ సినీప్లెక్స్" ప్రారంభం
|
ఒన్‌మాల్-ఒన్‌బ్రాండ్ నినాదంతో ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ముందుకు వచ్చింది. తొలుతగా జూబ్లీహిల్స్‌లోని కె. రాఘవేంద్రరావుకు చెందిన సినీప్లెక్స్‌లో ఎయిర్‌టెల్ సింగిల్‌బ్రాండ్‌గా వ్యవహరిస్తోంది.
ఈ నేపథ్యంలో 'ఎయిర్‌టెల్ ఆర్.కె. సినీప్లెక్స్'ను బుధవారం టాలీవుడ్ నటీనటులు వరుణ్‌సందేశ్, విమరలారామన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా భారతీ ఎయిర్‌టెల్ మొబైల్ దక్షిణాది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక మల్‌హోత్త మాట్లాడుతూ, భారతదేశంలోనే సినీప్లెక్స్‌లో సింగిల్‌బ్రాండ్‌గా ఉండడం అభివృద్ధికి తొలి అడుగని పేర్కొన్నారు.
వరుణ్‌సందేశ్ మాట్లాడుతూ, ఒన్‌మాల్-ఒన్‌బ్రాండ్ అనే విదానం బాగుందనీ, తాను నటించిన "ఎవరైనా ఎప్పుడైనా" చిత్రాన్నికూడా ఎయిర్‌టెల్ ప్రమోట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
విమలారామన్ మాట్లాడుతూ, తాను ఎయిర్‌టెల్ వినియోగదారురాలిననీ, ఎయిర్‌టెల్ తాను నటించిన చిత్రానికి పబ్లిసిటీ బాగా చేస్తుందని పేర్కొన్నారు. ఇకనుంచి భారతీ ఎయిర్‌టెల్ రాఘవేంద్రరావు సినీప్లెక్స్‌ను వారితో కలిసి అభివృద్ధి చేస్తుందని ఎయిర్‌టెల్ సి.ఒ.ఓ. రాజకిష్ తెలిపారు. డిజిటల్, బ్రాడ్‌బ్యాండ్, మొబిలిటీ ఎయిర్‌టెల్ వినియోగదారులకు సమగ్ర కేంద్రంగా సినీప్లెక్స్ ఉంటుందన్నారు.
సినీప్రియులకు పూర్తిస్థాయి వినోదాన్ని అందించే ఏకైక ఎయిర్‌టెల్ బ్రాండెడ్ వినోదకేంద్రంగా సినీప్లెక్స్ ఉంటుందని విమలా రామన్ తెలిపారు. వినోదంతోపాటు అంతర్జాతీయ రుచులు ఫుడ్‌కోర్ట్‌లో లభిస్తాయని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పికాక్ మీడియా లిమిటెడ్, లెమన్‌మీడియా అధినేతలు పాల్గొన్నారు.