Bollywood| Priyanka chopra| BirthDay| Fashion | హ్యాపీ బర్త్‌డే ''ప్రియాంక చోప్రా''
జులై 18న 26 వసంతాలు పూర్తి చేసుకుని 27లోకి అడుగుపెడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు హ్యాపీ బర్త్‌డే విషెష్ చెపుతాం. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమె నటనతోనే అందలమెక్కిన నటి ప్రియాంకా చోప్రా. కేవలం ఒక ఏడాదిలోనే ఆమె చేసిన చిత్రాలు చాలా తక్కువ అయినాకూడా ఆ చిత్రాలు ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టాయి.
'దోస్తానా' మరియు 'ఫ్యాషన్'లాంటి చిత్రాలు విమర్శకుల నోళ్ళు మూయించిందంటే అతిశయోక్తికాదు. 'దోస్తానా' చిత్రం ద్వారా ఆమె తన గ్లామర్‌ను ఆరబోసింది. అదే 'ఫ్యాషన్'లాంటి చిత్రంతో తన నటనా చాతుర్యంతో తనేంటో నిరూపించుకుంది.
ప్రియాంకా అంటే పడిచచ్చేవాళ్ళు ఎక్కువనే చెప్పాలి. తన నిజజీవితంలో హర్మన్ బావెజాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఆ తర్వాత ఆ సంబంధం కాస్త బెడిసికొట్టింది. కొద్ది రోజులకే షాహిద్‌తో ఆమెకు సంబంధం అంటగట్టారు. ఇప్పటివరకైతే ఆమె ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టలేదు. అసలు వీరిమధ్య లవ్ ఎఫైర్ ఉందా లేదా అనేది బాలీవుడ్‌లో చెవులుకొరుక్కుంటున్నారు. ఏదిఏమైనప్పటికీ ప్రస్తుతం తన దృష్టి నటనపైనే అంటోంది ప్రియాంకా చోప్రా.
ఇంతింతై వటుడింతై అన్న చందాన ఆమె తన కెరీర్‌ను నమ్ముకుని ముందుకు దూసుకుపోతోంది. ఆమె నటించిన "కమీనే", "ప్యార్ ఇంపాజిబుల్" మరియు "వాటీజ్ యువర్ రాశి"? చిత్రాలు విడదల కావాల్సి ఉంది. ఈ చిత్రాలు యష్‌రాజ్ ఫిల్మ్స్, అసుతోష్ గోవర్కర్ మరియు విశాల్ భరద్వాజ్‌చే నిర్మించబడిన చిత్రాలు. ఈ చిత్రాల్లో ఆమె నటనలో కొత్తదనం కనపడుతుందని బాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.
