1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. NagaChitanya

Josh Audio release | NagaChitanya| Karthika| Nagarjuna| Nageswara rao | గోల్డెన్‌హ్యాండ్‌ కాబట్టి అప్పగించాం: అక్కినేని

జోష్
WD
అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య ఆరో హీరోగా తెరంగేట్రం చేశాడని అక్కినేని నాగేశ్వర రావు అన్నారు.

నాగార్జున నాగచైతన్యను హీరోగా పరిచయం చేస్తున్నాడు అని చెప్పినప్పుడు హ్యాపీగా ఫీలయ్యాను. చైతన్యకు పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉంది. మరోవైపు తాత రామానాయుడు ఆశీర్వచనాలున్నాయని అక్కినేని పేర్కొన్నారు.

అందుచేత సొంత సినిమా చేద్దామనుకున్నాం. కానీ అనుకోకుండా దిల్‌రాజు తీస్తానన్నాడు. గోల్డెన్‌హ్యాండ్‌ కాబట్టి ఓకే చేశామని... అక్కినేని నాగేశ్వరరావు చెప్పారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో 'జోష్‌' ఆడియో కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా నాగేశ్వర రావు మాట్లాడారు. ఈ కార్యక్రమ్రానికి పలువురు సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సినిమా ఆడియో క్యాసెట్‌ను రాఘవేంద్రరావు విడుదలచేసి మోహన్‌బాబు, వెంకటేష్‌కు అందజేశారు. సీడీని స్పీకర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు.
WD

ఈ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ, తాను కూడా బాబాయ్‌గా నాగచైతన్యను దీవించడానికి వచ్చాను. ప్రస్తుతం కుర్రహీరోల పోటీ ఉంది. అందులో చైతన్య నెగ్గాలని ఆశించారు.

స్పీకర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, దిల్‌రాజు పిలిస్తే వచ్చాను. తాను చదివిన నిజాం కాలేజీ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. నాగచైతన్య ఈ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

దిల్‌రాజు మాట్లాడుతూ, కొత్తబంగారులోకం సినిమా టైమ్‌లో నాగార్జునను అడిగితే.. సాఫ్ట్‌స్టోరీ మా వాడికి కరెక్టకాదు.. కాస్త జోష్‌‌గా ఉండాలన్నారు. అలాంటి సమయంలో వాసువర్మ కథ చెప్పాడు. దాన్ని నాగార్జున సింగిల్‌ సిటింగ్‌లో ఓకే చేశారు. ఆగస్టులో సినిమాను విడుదలచేస్తామని వెల్లడించారు. ఈ సినిమాలో దర్శకుడి బలవంతంమీద ఓ బిట్‌సాంగ్‌ పాడాను. నాగచైతన్య 320 అడుగుల సీన్‌ అద్భుతంగా సింగిల్‌ టేక్‌లోనే చేశాడు. అతనికి మంచి భవిష్యత్‌ ఉందని చెప్పారు.
WD

రాధ కుమార్తె కార్తీక "జోష్‌"లో హీరోయిన్‌గా నటించింది. ఈ సందర్భంగా రాధ మాట్లాడుతూ, తాను ముగ్గురు పిల్లలతో హాయిగా ఉన్నాను. తనకు ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారో? అదేవిధంగా తన కుమార్తె కార్తికకు కూడా సినీ ఇండస్ట్రీ, ప్రేక్షకులు, అభిమానులు ఆదరణ ఇస్తారని ఆశించారు. గోల్డ్‌ హ్యాండ్‌తో మా అమ్మాయి తెరకు పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇంతకంటే అమ్మగా తనకేం కావాలి. అని స్పందించింది.
About Writer
SELVI.M