Cinema| Manchu Manoj| Prayanam| Sheena| Veerupotla | "మనోజ్" కొత్త చిత్రం 30శాతం పూర్తి!
|
రచయితగా మంచి పేరు తెచ్చుకున్న వీరుపోట్ల ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇకపోతే... సుందర రామబ్రహ్మం ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ, ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తయింది. మనోజ్‌కుమార్ తన నిజజీవితంలోలాగే సరదాగా, చలాకీగా ఉండే కుర్రాడిలా ఈ సినిమాలో కన్పిస్తాడన్నారు.
హీరో మనోజ్ మాట్లాడుతూ, ఈ చిత్రానికి అజయ్‌గాడి విజయగాధ, బిందాస్ అనే టైటిల్స్ అనుకుంటున్నాం. ప్రేక్షకులు ఎక్కువమంది ఏ టైటిల్‌కు ఓటేస్తే ఆ టైటిల్ పెట్టాలనుకుంటున్నాం.
మొదటి టైటిల్ నచ్చితే 'ఎ', రెండవ టైటిల్ నచ్చితే 'బి' అని టైప్‌చేసి 56006767 నెంబర్‌కు ఎస్.ఎం.ఎస్. చేయాలి. ప్రేక్షకులు నిర్ణయించిన టైటిల్ పెట్టడమేకాక వారికి బహుమతులు కూడా అందజేస్తామన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: బొబోశశి, కెమెరా: రమేష్‌బాబు.