1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. APJ Abdul Kalam

Former President| APJ Abdul Kalam| Slumdog Millionaire| Madhav Pandey | "మై కలాం హూ" చిత్రంలో నటిస్తోన్న అబ్దుల్ కలాం!

మాజీ రాష్ట్రపతి
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నటుడిగా అవతారమెత్తనున్నారు. "కలలు కనండి-వాటిని సాకారం చేసుకోండి" నినాదం ఆధారంగా హిందీలో ఓ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు.

ప్రముఖ హిందీ దర్శకుడు మాధవ్ పాండే రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఫ్రెంచ్ నటి సోఫీ, గుల్షన్ గ్రోవర్ తదితరులు నటిస్తున్నట్లు తెలిసింది. 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న "స్లమ్‌డాగ్ మిలియనీర్" లాగానే ఈ చిత్రంలోనూ కొందరు మురికివాడల పిల్లలను నటింపజేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

రాజస్థాన్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం పేరు "మై కలాం హూ". నిజజీవితంలో శాస్త్రవేత్త అయిన అబ్దుల్ కలాం ఈ సినిమాలోనూ అదే పాత్రలో కనిపించనున్నారు.
About Writer
SELVI.M