Mahatma| Tushar Gandhi| Srikanth| Chiranjeevi| Krishna Vamsi| August 15| Audio | ''తుషార్ గాంధీ''చే "మహాత్మా" ఆడియో విడుదల?
|
ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దాదాపు షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆడియోను ఆగస్టు 15న విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇందులో విశేషమేమంటే..? గాంధీ మనవడు "తుషార్‌గాంధీ" చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని జరపాలని చిత్ర యూనిట్ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన నుంచి గ్రీన్‌సిగ్నల్ తెచ్చేందుకు ప్రముఖ రాజకీయ నాయకుడి సలహాలు తీసుకున్నారు.
మరోవైపు.. చిరంజీవి సన్నిహితుడుగా శ్రీకాంత్ మంచి పేరున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి, శ్రీకాంత్‌లు నటించిన "శంకర్‌దాదా జిందాబాద్" సినిమాను కూడా తుషార్‌గాంధీకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు.