Vidheyudu| Love Story| Nandu| Rachna Malhotra| Shooting | ప్రేమకథా నేపథ్యంలో వస్తోన్న "విధేయుడు"
|
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. శుక్రవారంతో షూటింగ్ పూర్తయిందన్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఆగస్టు 15న ఆడియోను, చివరిలో సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రేమకథా నేపథ్యంలో "విధేయుడు" రూపొందుతున్నాడని నిర్మాత వివరాలందించారు.
గతంలో తాము తీసిన "వినాయకుడు" చిత్రం ప్రేక్షకుల మన్ననలను చూరగొందని ఆయన తెలిపారు. ఈ సినిమా కూడా కథను నమ్ముకుని తెరకెక్కించనున్నామని ప్రేమ్ కుమార్ అన్నారు. వి.ఎన్. ఆదిత్య, గుణశేఖర్ దగ్గర పనిచేసిన సాయిమీరా దర్శకుడిగా పరిచయం అవుతున్నారని నిర్మాత వెల్లడించారు.