1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. "కింగ్" నాగార్జున కొత్త చిత్రం ప్రారంభం

Nagarjuna, King, Cinema, Nageswara Rao, Kamakshi Kala Movies | "కింగ్" నాగార్జున కొత్త చిత్రం ప్రారంభం

నాగార్జున
WD
యువసామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రం శ్రావణ శుక్రవారం సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది.

వేదపండితులు అక్కినేని నాగార్జునను ఆశీర్వదిస్తూ అక్షింతలు చల్లారు. దేవుని పటాలపై అక్కినేని నాగేశ్వర రావు క్లాప్ కొట్టారు.

కామాక్షి కళా మూవీస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి షెడ్యూల్ గుంటూరు, హైదరాబాదుల్లో జరుగనుంది. నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
About Writer
SELVI.M