1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Website

Magadheera| Website| Rating| Supreme| Music| Gopi Gopika Godavari | "మగధీర"ను వెబ్‌సైట్లు రేటింగ్‌తో ఆదుకోండి!

మగధీర
WD
వెబ్‌సైట్లో రేటింగ్‌లంటూ ముందుగా ఇచ్చేసి బిజీగా ఉండే ఎవరీసీస్ వారికి బ్రేక్‌లేస్తున్నారని సుప్రీం మ్యూజిక్ అధినేత రాజు హర్వాణి అంటున్నారు. "మగధీర"తో పంపిణీ రంగంలోని అడుగుపెట్టిన సుప్రీం మ్యూజిక్ ఈ సినిమాను వెబ్‌సైట్లు రేటింగ్‌తో ఆదుకోవాలని హర్వాణి కోరారు.

గత పదిహేడు సంవత్సరాలుగా చలన చిత్ర ఆడియో రంగంలో ఉన్నామని చెప్పారు. సినీ పరిశ్రమ ఎంతగానో ఆదరించిందని, నార్త్ అమెరికాలో ఓవర్‌సీస్ హక్కులు పొంది "మగధీర" ఈ నెల 31 చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చెప్పారు. 35 ప్రింట్లతో 40 సెంటరల్లో రిలీజ్ చేస్తున్నామని హర్వాణి తెలిపారు. ఆ తర్వాత స్నేహితుడా, రెచ్చిపో చిత్రాలు రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు సాగర్, శక్తి ఫిలింస్ రమేష్, దుబాయ్ పంపిణీదారుడు ధర్మకర్త తదితరులు పాల్గొన్నారు. వీరు కూడా మాట్లాడుతూ.. గోపి గోపిక గోదావరి.. సినిమా బాగోలేదని రాశారు. దాని వల్ల ఓవర్‌సీస్‌లో పంపిణీచేసి దిబ్బతిన్నామని, కనీసం 2, 3 రోజులు ఆలస్యంగా రాయండని కోరారు.
About Writer
SELVI.M