Anjaneyulu| Raviteja| Nayantara| Ali| AVS| Super Hit | బొత్సగారూ.. చూశారా మా ఎంజాయ్‌మెంటూ: కోట
|
శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు, మంత్రి బొత్స, కోట శ్రీనివాసరావు, రవితేజ, ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు అలీ, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.
ఒకవైపు ఆంజనేయులు ఆడియో ఎంతో ఉత్సాహంగా దాసరి చేతుల మీదుగా విడుదల కాగా, మరోవైపు హాస్య నటుల చలోక్తులు ఆహుతులను ఎంతగానో నవ్వించాయి.
|
ఇందులో భాగంగా.. జోకులు, చలోక్తులతో సభికులందరినీ ఆహ్వానించిన ఏవీఎస్, ఉన్నట్టుండి.. అంతా కాసేపు బాధపడాల్సిన విషయం. ఇండస్ట్రీలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. నేను చెప్పే విషయాన్ని గుండెదిటవుచేసుకుని వినాలి.
పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులు రావాల్సిన వాడు.. ఎవరికీ అన్యాయం చేయని వాడు. అందరినీ నవ్వించేవాడు. పాపం ఆయనకు అన్యాయం జరిగింది. ఆయనకు న్యాయం జరిగాలని మనమంతా కోరుకోవాలని.. అనగానే.. సభలో ఒక్కసారి నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
ఆంజనేయులు చిత్రానికి బ్రహ్మానందానికి 11 రోజులు డేట్స్ అడిగి.. ఐదు రోజులతో ముగించారు. అయితే నా వద్ద 30 రోజుల డేట్స్ తీసుకుని ఒక్కరోజు కూడా వేషం ఇవ్వకుండా ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. అక్కడ వేషం ఇవ్వకపోయినా సభలో వ్యాఖ్యాతగా వేషం ఇచ్చారంటూ.. చెప్పగానే.. సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.
అదేవిధంగా సభా ప్రాంగణంలో నువ్వేం వర్రికాకు.. ఆంజనేయులు సూపర్‌డూపర్ హిట్ అవుతుందని.. ఇంకే ఆలోచించకు అంటున్న ఆలీతో.. ఇంకా చెప్పండి గురువుగారు.. అంటూ పిల్లాడిలా రవితేజ చేతులు కట్టుకుని నిలబడ్డారు.
|
మరోవైపు.. చూశారా.. ఎప్పుడు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఎదుటివారిపై దాడిచేసి, చూసేవారికి బీపీ తెప్పించే మీరు.. మా ఫంక్షన్స్‌కి వస్తే ఎంత ఎంజాయ్‌మెంటో.. అంటూ బొత్స, ఘంటా శ్రీనివాస్‌తో కోటా శ్రీనివాసరావు చలోక్తి విసిరారు.