1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Sivaji

Rajinikanth| Sivaji| Suman| Director| Katragadda Prasad| Akkineni | దర్శకుడిగా అవతారమెత్తనున్న "సుమన్‌"!

రజనీకాంత్
WD
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటించిన 'శివాజీ'లో విలన్‌‌ పాత్రను పోషించిన సుమన్‌ త్వరలో దర్శకుడిగా అవతారమెత్తనున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌ నిర్మించే చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాతే ధృవీకరించారు.

సుమన్‌తో కాట్రగడ్డ ప్రసాద్‌కు చాలా సన్నిహిత సంబంధాలుండేవి. అప్పట్లో సుమన్‌పై కేసులుండగా చాలామంది సన్నిహితులు ఆయనకు దూరమయ్యారు. కానీ కాట్రగడ్డ ప్రసాద్‌ వెన్నంటి ఉండి సుమన్‌కు ఆసరాగా నిలిచారు. ఇప్పటికే కథ సిద్ధమైందనీ, ఆ చిత్రం నవంబర్‌లో కార్యరూపం దాల్చనున్నట్లు కాట్రగడ్డ ప్రసాద్‌ తెలిపారు.

త్వరలో అక్కినేనితో కూడా సినిమా నిర్మించడానికి కాట్రగడ్డ ప్రసాద్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈయన ప్రస్తుతం దక్షిణ భారత చలన చిత్ర సమాఖ్య గౌరవ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
About Writer
SELVI.M