1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. darga

Kadapa | darga | Ameenpeer | RamCharan | Film | | కడప దర్గాలో "మగధీర" ప్రత్యేక ప్రార్థనలు

కడప
File
FILE
కడప జిల్లా కేంద్రంలో ఉన్న అమీన్‌పీర్ దర్గాను మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ బుధవారం దర్శించుకున్నారు. తాను కొత్తగా నటించిన 'మగధీర' ఈనెల 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం హిట్ కావాలని కోరుతూ రామ్ చరణ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఆ తర్వాత కడపలోనే ఉన్న విజయదుర్గ ఆలయానికి వెళ్లి, ప్రత్యేక పూజలు చేయించారు.

పూజలు అనంతరం ఆయన అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రితో కలిసి ఓ పాటలో డ్యాన్స్ చేయడం తన జీవితంలో మరుపురాని గొప్ప అనుభూతిగా పేర్కొన్నారు. ఇదిలావుండా, చిరంజీవి పార్టీని ఏర్పాటు చేశాకు ఆయన కడప దర్గాను దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనలు చేసిన విషయం తెల్సిందే.

ఎంతో మహిమ కలిగిన దర్గాగా దీనికి పేరుంది. అందుకే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ తన కుటుంబంతో ఇక్కడకు వచ్చిన ప్రార్థనలు చేశారు. అలాగే, ఆస్కార్ అవార్డు గ్రహీత, భారత సంగీత రారాజు ఏ.ఆర్.రెహమాన్ కూడా ఈ దర్గాను క్రమం తప్పకుండా దర్శిస్తూ ప్రార్థనలు చేస్తుంటారు. ఈ దర్గాను సందర్శించి, ప్రార్థనలు నిర్వహిస్తే, తాము అనుకున్నది నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
About Writer
PNR