1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Rajan P. Dev

Malayalam actor | Rajan P. Dev | died | illness | "ఆది", "ఖుషీ" విలన్ రాజన్ పి.దేవ్ కన్నుమూత

రాజన్ పి దేవ్
WD
ఆది, ఖుషీ తదితర తెలుగు చిత్రాల్లో నటించి మేటి విలన్ అనిపించుకున్న మలయాళ నటుడు రాజన్ పి.దేవ్(58) బుధవారం కన్నుమూశారు. లివర్ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్ బుధవారం కేరళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

రాజన్ కేరళలోని అలప్పుఝాలోని చేర్టలాలో జన్మించారు. 1980ల్లో చిన్నచిన్న పాత్రలలో నటిస్తూ కెరీర్ ప్రారంభించిన రాజన్, విలన్ పాత్రల్లో బాగా రాణించారు. దక్షిణాదిలోని మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమలలో ఆయన సుమారు 180 పైగా చిత్రాలలో నటించారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు దక్షిణాది వెండితెరపై మేటి విలన్‌గా వెలుగొందారు.

ముఖ్యంగా మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌కు బ్రేక్‌నిచ్చిన "ఆది"లో రాజన్ నటన మరువలేనిది. అలాగే "ఖుషీ"లో పవన్ కల్యాణ్ చెప్పింది విని చిటికెలేసి టైం అయిపోయింది బండి తీయండ్రా అంటూ చెప్పే విలనిజం రాజన్ సొంతం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT