1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Ish

Bollywood | Ish | Abhi | accident | Ram | | ''గజరాజు'' ఆగ్రహం: ''అభి-ఐష్''లకు తప్పిన ప్రమాదం

బాలీవుడ్
File
FILE
బాలీవుడ్ హీరో హీరోయిన్లు ఐశ్వర్యారాయ్, అభిషేక్‌ బచ్చన్‌లకు పెద్ద ప్రమాదం తప్పింది. ప్రముఖ దర్శక నిర్మాత మణిరత్నం "రావణ్" అనే చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ కేరళ రాష్ట్రంలోని త్రిచూర్‌లో జరుగుతోంది. ఒక సన్నివేశ చిత్రీకరణ కోసం గజరాజును తీసుకొచ్చారు. ఆ ఏనుగు షూటింగ్ లొకేషన్‌లో వీరంగం సృష్టించింది.

గజరాజు ఆగ్రహానికి తీవ్రంగా గాయపడిన మావటి అక్కడికక్కడే మరణించినట్టు సమాచారం. అదృష్టవశాత్తు హీరోయిన్ ఐశ్వర్యాయ్, హీరో అభిషేక్‌ బచ్చన్‌లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరిద్దరు ఉన్న ప్రాంతానికి అతి సమీపంలో ఈ ప్రమాదం జరగింది. అయితే, 'అభి-ఐష్‌'లు సురక్షితంగా బయటపడినట్టు సమాచారం తెలియడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
About Writer
PNR