Power Star| Pawan Kalyan| Harish| Parameswara Art| Ganesh Babu | హరీష్ దర్శకత్వంలో పవర్‌స్టార్ కొత్త చిత్రం!
FILE
ఈ చిత్రం గురించి నిర్మాత గణేష్‌బాబు మాట్లాడుతూ.. తమ బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కోసం దర్శకులు హరీష్ శంకర్ అద్భుతమైన సబ్జెక్ట్ సిద్ధం చేశారని తెలిపారు. కథ వినగానే పవన్ ఎంతో ఇన్‌స్పైర్ అయి వెంటనే ఈ చిత్రం చేయడానికి అంగీకరించారని గణేష్ బాబు చెప్పారు.
ప్రేక్షకులు, అభిమానులు పవన్‌కళ్యాణ్‌ని ఏ తరహా క్యారెక్టర్‌లో చూడాలనుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్‌ని ఇందులో పవన్ చేస్తారని నిర్మాత వెల్లడించారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో భారీ ఎత్తున నిర్మాణం అయ్యే ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించి 2010 సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
పరమేశ్వర ఆర్ట్ పతాకంపై పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ప్రొడక్షన్ నెం-1ని ప్లాన్ చేసిన నటుడు గణేష్ బాబు, రవితేజతో ప్రొడక్షన్ నెం-2గా ఆంజనేయులు చిత్రం చేశారు.
పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో గణేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం "ప్రొడక్షన్ నెం-3"గా రూపొందుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని తెలియజేస్తారు.
ఇంకా ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బడే రవికిరణ్ బాబు, నిర్మాత: గణేష్ బాబు, దర్శకత్వం: హరీష్ శంకర్.