Priyamani| Heroine| Kumar Brothers| Cinema| Glamour Roles | "ప్రియమణి" హీరోయిన్‌గా కుమార్ బ్రదర్స్ సినిమా!
WD
ఈ చిత్రాన్ని కె.బి.సి. పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తుండగా.. ఈ సినిమా ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడిగా పరిచయం కానున్నారు.
కథాపరంగా, సాంకేతిక అంశాలపరంగా ఈ చిత్రం అత్యుత్తమ స్థాయిలో ఉంటుందని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు కుమార్ బ్రదర్స్ చెప్పారు.
ఈ చిత్రంలో ప్రియమణి పాత్ర ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుందని, ప్రియమణి సరసన ఓ ప్రముఖ కథానాయకుడు నటిస్తారని దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ వెల్లడించారు.
సెప్టెంబర్‌లో లాంఛనంగా పూజాకార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: శ్యామ్ మనోహర్, మాటలు: శ్యామ్-మడూరి మధు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎ. పాండురంగ, జి. హరినాథ్.