1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Katrina Kaif

Foreign heroine | Katrina Kaif | horoscope | Scorpio Lgn | కత్రినా జాతకమేంటో తెలుసా...!

కత్రినాకు సుఖ సంతోషాలు మెండుగా ఉంటాయి.

కత్రినా కైఫ్
FILE
అందంతోపాటు చలాకీతనంతో బాలీవుడ్‌ను తన వశం చేసుకున్న ఓ విదేశీ వనిత... హీరోయినై ప్రజల మనసును దోచుకుంటున్న ఆ సుందరాంగి... ఎవరో తెలుసా... ఆమే కత్రినా కైఫ్. చూపు మరల్చుకోలేని అందం ఆమె సొంతం.

కత్రినా కైఫ్ 16 జులై 1984 సాయంత్రం గం 6.30లకు హాంగ్‌కాంగ్‌లో పుట్టింది. సోమవారంనాడు పుట్టిన ఈమె జన్మకుండలి ఓసారి పరిశీలిస్తే...వృశ్చికలగ్నం కుంభరాశిలో జన్మించింది.

ఈ రాశిలో పుట్టిన వారు సౌందర్యవంతులుగాను, ఇతరులను తమ అందంతో ఇట్టే కట్టిపడేసే సమర్థులుగాను ఉంటారు. ఈమె జన్మకుండలిలోని అన్ని గ్రహాలు ఆమెకు అనుకూలంగా ఉన్నాయి. ఇది ఆమె జీవితంపై తప్పక ప్రభావాన్ని చూపిస్తాయి.

సప్తమంలో(వృషభం)ఉచ్చస్థితిలోనున్న రాహువు జన్మస్థానంలో ఉండటం కారణంగా విదేశాలకు వెళ్ళి సంపాదించే యోగం ఉంది. మిత్రుని గృహంలో కేతువు సంపాదనలోకూడా ఉదారస్వభావాన్నిచ్చాడు. దీంతోపాటు సుఖసమృద్ధినికూడా పుష్కలంగా ఇస్తాడు. గురువు ద్వితీయంలో స్వరాశిలో ఉండంటంతో అది పంచమంలో కళలద్వారా డబ్బును ఆర్జించి, తన కుటుంబ సహకారంతో జీవితంలో వృద్ధి జరిగేలా చూస్తుంది.

ఈ రాశివారికి ధనం సమృద్ధిగా ఉంటుంది. లగ్నంలో కుజుడు శనితో వ్యయ స్థానంలోనున్నాడు. తను తీసుకునే నిర్ణయాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. దీంతోపాటు ఆలోచనల్లో అస్థిరత్వం, రక్తలేమి సంబంధిత బాధలుంటాయి. దీంతో వీరు జాగరూకతతో వ్యవహరించాలి.

ఈ జాతకురాలికి రవి, బుధుడు, శుక్రుడు, భాగ్యంలోనున్నారు. రవి శుక్రునికి మిత్ర గృహంలోనుండటంతో భాగ్యవృద్ధి కలుగుతుంది. ప్రస్తుతం కత్రినాకైఫ్‌కు గురు మహర్దశ జరుగుతోంది. ఇందులో శుక్ర భుక్తి జులై పదవ తేదీవరకు. ఈ సమయం ఆమెకు అనుకూలంగానే ఉంటుంది. ఒకటి రెండు సినిమాలు ఆమెకు హిట్‍‌నిచ్చేటివిగా ఉంటాయి.

రానున్న రోజుల్లో ఆమె విదేశీ చిత్రంలో నటించే అవకాశాలున్నాయి. అలాగే ఆమె స్కాండల్‌ను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2010 ప్రారంభంలో రవి మహర్దశతో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు అవార్డులను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రానున్న రెండు సంవత్సరాల తర్వాత వివాహం గురించి ఆలోచనలు చేయవచ్చంటున్నారు జ్యోతిష్యులు.

ఏది ఏమైతేనేమి ప్రస్తుతం ఆమెకు కీర్తి-ప్రతిష్టలతోపాటు సుఖ-సమృద్ధి మెండుగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువుల సలహాలు తీసుకోవడం, పేద పిల్లల చదువులో సహాయ పడటం ఈమె మార్గాన్ని సుగమం చేస్తాయంటున్నారు జ్యోతిష్యులు.
About Writer
Gulzar Ghouse