1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. ఐర్లండ్‌ ద్వీపంలో నా హనీమూన్‌: గోపిక

Gopika, Hanymoon, Irland, | ఐర్లండ్‌ ద్వీపంలో నా హనీమూన్‌: గోపిక

గోపిక
WD
"మా ఆయన ఐర్లాండ్‌లో వైద్యుడు. పెళ్లి అయిన తర్వాతహనీమూన్‌కు అక్కడ ఓ ద్వీపంలో వారం రోజులుగడిపాం" అని నటి గోపిక చెబుతోంది. నా ఆటోగ్రాఫ్‌, వీధి చిత్రాల్లోనటించిన గోపిక తమిళంలో పలు చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌కోసం కేరళ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... "పెళ్లి కుదిరే వరకు నేను నటినన్న విషయం ఆయనకు తెలీదు. తెలిశాక పెళ్లయ్యాక్కూడా నటించమని చెప్పారు. ప్రస్తుతం రెండు మలయాళ చిత్రాలు చేస్తున్నా. అవి పూర్తయ్యాక ఐర్లాండ్‌ వెళతాను. మళ్ళీ అవకాశాలొస్తే తిరిగి వస్తాన"ని చెబుతోంది.

తన చెల్లెలు షైనీ గురించి చెబుతూ.. ఇంకా కాలేజీ చదువు పూర్తికాలేదని.. సినిమాల్లో నటిస్తుందో లేదో తనకు తెలియదని చెప్పింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT